వర్మ 22 వరకు ఆగలేకపోతున్నాడట..

Update: 2017-12-02 11:46 GMT
రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రెటీల్ని తనదైన శైలిలో పొగిడి చాలా కాలమైపోయింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి లాంటి వాళ్లను వర్మ ఏ రేంజిలో పొగిడాడో తెలిసిందే. ఈ మధ్య వర్మ చాలా వరకు వివాదాస్పద విషయాలపై నెగెటివ్ కామెంట్లే చేస్తూ వస్తున్నాడు. డ్రగ్స్ కుంభకోణం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా.. నంది అవార్డుల వివాదం.. ఇలాంటి అంశాలపై వర్మ కౌంటర్లే వేశాడు తప్ప సోషల్ మీడియాలో పెద్దగా పాజిటివ్ కామెంట్లు చేయలేదు. ఐతే వర్మ కొంచెం బ్రేక్ తీసుకుని మళ్లీ పొగడ్తల కామెంట్రీతో వచ్చాడు. ఆయన అక్కినేని అఖిల్ ను ఆకాశానికెత్తేశాడు.

‘హలో’ ట్రైలర్ చూసి వర్మ చాలా ఎగ్జైట్ అయిపోయాడు. ఈ ట్రైలర్ చూశాక తాను ఈ చిత్ర విడుదల తేదీ డిసెంబరు 22 వరకు ఆగలేకపోతున్నానని అన్నాడు తనుకు తానే ‘అఖిల్’గా లాంచ్ అవుదామనుకున్నది అఖిల్ అసలు ఆలోచన అని.. కానీ ఎప్పుడైతే అఖిల్ నిజంగా ప్రేక్షకులకు ‘హలో’ చెప్పాడో అప్పుడే విధి అఖిల్ కోసం మరో ప్లాన్ సిద్ధం చేసిందని వర్మ అన్నాడు. అఖిల్ ముఖంలోని తపనను చూశాక తాను ఆశ్చర్యపోయానని. యాక్షన్ రిఫ్రెష్ అయి తాజాగా కనిపించిందని వర్మ కామెంట్ చేశాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ ‘మనం’ సినిమాలోని మంచి ఫీల్ ను పోనివ్వకుండా రొమాంటిక్ అడ్వెంచర్ తో ‘హలో’ను తీర్చిదిద్దాడని.. అందుకే తాను 22వ తేదీ వరకు ఆగలేకపోతున్నానని వర్మ అన్నాడు. ఐతే నాగార్జునతో సినిమా చేస్తున్న నేపథ్యంలోనే వర్మ ఇలా అఖిల్ గురించి తనదైన శైలిలో రెస్పాండయ్యాడని అంటున్నారు జనాలు. ఐతే ఇలాంటి కామెంట్లను నాగార్జున లైట్ తీసుకుంటాడన్న సంగతి వర్మకు తెలియందేమీ కాదు.
Tags:    

Similar News