వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాటలు.. ఆయన పోస్ట్ చేసే ట్వీట్లు ఎంత ఘాటుగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆర్జీవీ ఒక్కసారి టార్గెట్ చేయటం షురూ చేస్తే.. ఎన్ని యాంగిల్స్ లో పంచ్ వేసే అవకాశం ఉందో.. అన్నింటిని వాడటమే తప్పించి.. ఒక్కదాన్ని మిస్ చేయటం కనిపించదు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో పెను వివాదానికి కారణమైన ఆయన.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో విడుదలకు నోచుకోని వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్ర విడుదలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెబుతూ.. ఏపీలో ఆయన భారీ ఎత్తున నిరసన.. నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టటం లాంటివి చేస్తానని చెప్పటం.. నిర్మాతతో కలిసి బెజవాడకు వెళ్లటం తెలిసిందే.
వర్మను అడ్డుకున్న పోలీసులు.. ఆయన ఎక్కడా మాట్లాడకుండా చేయటమే కాదు.. విజయవంతంగా హైదరాబాద్ కు పంపటంలో సక్సెస్ అయ్యారు. వరుస ట్వీట్లతో వాతావరణాన్ని హీటెక్కించేలా చేసిన వర్మ.. తన ప్రయత్నం విజయవంతం కాకపోవటంతోపై తనకున్న అసహనాన్ని తన ట్వీట్లతో చెప్పేశారు.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునుఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య సంచలనంగా మారిందని చెప్పక తప్పదు. చంద్రబాబును ఉద్దేశించి సూటి విమర్శ చేసిన వర్మ.. నలభై ఏళ్ల రాజకీయ కెరీర్.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఒక సినిమాకు భయపడటమా? అని ప్రశ్నించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బాబు భయపడుతున్నారని చెబుతూ.. తన తాజా చర్యలతో చంద్రబాబు నిజంగానే లోకేశ్ పప్పూస్ తండ్రి అనిపించుకున్నట్లుగా వ్యంగ్యస్త్రాన్ని సంధించి చురుకు పుట్టించారు. మరి.. వర్మ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.