కిల్లింగ్ వీరప్పన్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలన సినిమా తీయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వీరప్పన్ తరువాత వంగవీటి రంగ జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని సంచలనానికి తెరలేపిన రామ్ గోపాల్ వర్మ.. ఆ తరువాత వంగవీటి రంగ కుమారుడు రాధా కృష్ణ నుంచి వార్నింగ్ కూడా అందుకున్నాడు. రంగ గురించి ఏదైనా తప్పుగా చూపించినా.. కథ మార్చినా రంగ అభిమానులు ఊరుకోరని.. వర్మకు ఏదైనా జరిగితే ఆ తరువాత తన బాధ్యత కాదని రాధా ఆ మధ్య వార్నింగ్ ఇచ్చారు. రాధా వార్నింగ్ కు ఇప్పుడు వర్మ కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు.
'వంగవీటి రంగ గురించి ఆయన కొడుకు రాధా కన్నా నాకే ఎక్కువగా తెలుసు. కానీ తనకు తెలియని తన పెదనాన్న విషయాలు నాకు తెలుసు.. ఎందుకంటే ఇవాల్టి రాధా అప్పుడు పిల్లోడు'' అంటూ ఆయన రాధాను రెచ్చగొట్టారు. అంతేకాదు.. ''నేనప్పుడు స్పాట్ లో ఉన్నా.. ఎప్పుడూ స్పాట్ లో లేని వాళ్ళు కేవలం స్పాట్లు పెట్టిన వాళ్ళకు పుట్టినంత మాత్రాన వాళ్ళే స్పాటు పెట్టగలం అనుకుంటే అది పిల్లతనం'' అంటూ ఎగతాళి కూడా చేశారు. ''రంగ తనయుడైన ఇవాల్టి రాధాకి అలనాటి రాధా వాల్యూలో 1 శాతం అర్థం అయితే తను కూడా మాటల రాధా కాకుండా చేతల రాధా అయ్యేవాడు. నేను నా సినిమా తేడాగా తీస్తే రంగ గారి ఫ్యాన్స్ ఊరుకోరు అని వార్నింగ్ ఇచ్చిన రాధా కు నా కౌంటర్ వార్నింగ్, ముందు ఫ్లాష్ బ్యాక్ అర్థం చేసుకో.. ఇవాల్టి రాధా కన్నా అలనాటి రాధా, రంగాలతో నేనెక్కువ సమయం గడిపాను.. ఇవాల్టి రాధాను పిల్లోడిగా బ్యాక్ గ్రౌండ్ లో ఆడుకోవడం చూసాను. రంగ గారు తన కొడుకు గురించి చెప్పేవారు వీడు ఎంత పెరిగినా ఇంకా పిల్లోడిగానే బిహేవ్ చేస్తాడని ఆయన అనేవారు... రాధా ఇప్పటికీ పిల్లోడిగా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. రంగ గారి అభిమానులందరినీ నేను గౌరవిస్తాను. కానీ రంగ గారి గురించి నెహ్రు గారికి తెలిసినంత కూడా తెలియని రాధాను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు కానీ, కాపు అయ్యుండి కూడా కాపులెనకాల దాక్కునే కమ్మ మనస్తత్వం ఉన్న వాడిని ఫస్ట్ టైం చూస్తున్నాను'' అంటూ వర్మ రౌడీ లెవల్లో వార్నింగు ఇచ్చారు. రాధాకు ఇచ్చిన వార్నింగులతో ఆయన ట్విట్టర్ అకౌంటును నింపేశారు.