మోడీని హిట్లర్ తో పోల్చిన వర్మ

Update: 2019-05-02 06:30 GMT
రాంగోపాల్ వర్మ.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు.. ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు..కేసీఆర్ ను అప్పుడే తిడుతాడు.. అప్పుడే ఆయనపై బయోపిక్ తీస్తాడు. ఇక చంద్రబాబును చెడుగుడు ఆడేస్తాడు.. ఎవరో ఒకరిని తిడుతూ వార్తల్లో నిలుస్తాడు. వివాదాలు లేనిదో పూట గడవని వర్మ.. ఎవరినో ఒకరిని వివాదాల్లోకి లాగి ఆనందపడుతుంటాడు. వర్మతో పెట్టుకోవడం అంటే అది వాళ్లకే రిస్క్ అనేంతలా పరిస్థితి తయారైంది.

తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఏపీలో విడుదల చేయాలని వర్మ చేసిన హంగామా అంతా ఇంతకాదు.. ఏపీలో పోలింగ్ ముగియడంతో విడుదల చేయడానికి తేదీని నిర్ణయించారు. కానీ ఫలితాలు వెలువడే వరకు కోడ్ అమల్లో ఉంటుందని.. కాబట్టి మే 23వరకూ ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేయడానికి వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది.దీంతో వర్మ ఆశలు నెరవేరలేదు.

దీంతో ఖాళీ టైంలో చంద్రబాబు పని అయిపోవడంతో తాజాగా మోడీపై పడ్డారు వర్మ. మోడీని టార్గెట్ చేస్తూ తాజాగా ట్వీట్ చేశాడు. మోడీని - జర్మనీని నియంతగా పాలించిన హిట్లర్ ఫొటోలను షేర్ చేసి దారుణ కామెంట్స్ చేశారు. రెండు ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ ఓ చిన్నపాపతో తీసుకున్న ఫొటోని.. ప్రధాని మోడీ ఓ విదేశీ యాత్రలో చిన్నారి చెవులు పిండుతూ తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు.. ‘సేమ్ టు సేమ్’ అంటూ కామెంట్ చేశారు. అప్పుడు హిట్లర్ జర్మనీకి నియంత అయితే.. ఇప్పుడు దేశానికి ప్రధాని మోడీ నియంత అని స్ఫూరించేలా వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరి వర్మ కౌంటర్ కు బీజేపీ నేతలు ఎలా ఎన్ కౌంటర్ చేస్తారనేది వేచిచూడాలి.
Tags:    

Similar News