ఇండియా మొత్తంలో ఏదైనా సెన్సేషన్ జరిగితే చాలు.. ఆ కాన్సెప్ట్ పై సినిమా చేసేస్తున్నానని చెప్పడం వర్మకు బాగా అలవాటు. సెన్సేషన్స్ సినిమాలతో మాత్రమే కాకుండా.. ఇలాంటి స్టేట్ మెంట్స్ తో కూడా సృష్టించే వర్మ.. ఇప్పటికే జయలలిత-శశికళలపై సినిమా తీస్తానని చెప్పాడు.
ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కు తన సినిమా క్లైమాక్స్ మార్చుకోక తప్పేటట్లు లేదు. అక్రమాస్తుల కేసు విషయంలో.. సుప్రీం ఇచ్చిన తీర్పు కారణంగా వర్మ కథకి ముగింపు మారక తప్పని పరిస్థితి నెలకొంది. సాధారణంగా అయితే.. అమ్మ తర్వాత చిన్నమ్మకు అధికారం వచ్చేస్తుందని భావించారు కానీ.. ఈ కేసులో అందరూ ముద్దాయిలే అని సుప్రీం తేల్చేసింది. దీంతో శశికళకు నాలుగేళ్ల జైలు తప్పనిసరి పరిస్థితి.
సినిమా తీస్తానని చెప్పినంత మాత్రాన వర్మ తీసేస్తాడా అనుకోవడానికి లేదు. వర్మ ఓ మాట చెప్పగానే.. దానికి సంబంధించిన బ్యాకెండ్ వర్క్ మొదలైపోతూ ఉంటుంది. ఎప్పుడు తీశారో కూడా తెలీకుండానే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేయగల ట్యాలెంట్ ఉన్న దర్శకుడు వర్మ. ఇప్పుడు అక్రమాస్తుల కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు కారణంగా జయలలిత-శశికళలపై తీస్తానని చెప్పిన బయోపిక్ స్క్రిప్ట్ లో మార్పులు చేసుకోక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/