ప్చ్.. ఆఫీసర్ తో వాళ్ళకి కాసుల పంట

Update: 2018-06-04 04:31 GMT
హీరో నాగార్జున అభిమానులు భయపడినంత పనీ జరిగింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం అస్సలు ఫాంలో లేని టైంలో అతడితో సినిమా చేయడం అనే నిర్ణయం అభిమానులకు మింగుడు పడకపోయినా ఆర్జీవీ ఏదో ఒక మెరుపు మెరిపించకపోతాడా అని ఆశపడ్డారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోతోంది.

ఆఫీసర్ సినిమా కొన్నవారంతా నష్టాలు తప్పవని తెలిసి ఏమేరకు పోగొట్టుకుంటామో అని లెక్కలేస్తున్నారు. మరి ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా అయిన రామ్ గోపాల్ వర్మ ఎంత నష్టపోయి ఉంటాడని డౌట్ రావచ్చు. కానీ ఆరా తీస్తే తెలిసిదేంటంటే ఆఫీసర్సినిమా ఆర్జీవికి బోలెడు ప్రాఫిట్ మిగిల్చింది. ఈ సినిమా షూటింగ్ కోసం పెద్దగా ఖర్చేం చేయలేదు. ముంబయి చుట్టుపక్కల ఏరియాల్లో సింపుల్ గా పని పూర్తి చేసేశారు. తక్కువ ఖర్చు పెట్టి టెక్నికల్ గా సూపర్ అనిపించేలా తీయడంలో రామ్ గోపాల్ వర్మ సిద్ధహస్తుడు. మొత్తం సినిమా ఖర్చు రూ. 8 కోట్లలోపేనని తెలుస్తోంది.

ఆఫీసర్ రెండు తెలుగు రాష్ట్రాల థియేటరికల్ రైట్స్ రూ. 6 కోట్లకు అమ్మేశారు. శాటిలైట్.. డిజిటల్ రైట్స్ ఇలా ఓ రూ. 10 కోట్ల వరకు గిట్టుబాటు అవుతాయి. కాస్టింగ్ లో హీరోగా నటించిన నాగ్ కు  తప్ప మిగతావాళ్లకు పెద్దగా రెమ్యునరేషన్ అవసరం లేదు. ఈ లెక్కన చూసుకుంటే నాగ్ కు ఇచ్చింది తప్ప మిగతాదంతా ఆర్జీవికి మిగులే. సినిమా దారుణమైన ఫ్లాపయినా రామ్ గోపాల్ వర్మ లాసయిందేం లేదు. అదీ ఆర్జీవీ లెక్క!!


Tags:    

Similar News