మియా వర్సెస్ దీపూ.. టూ మచ్ కదూ

Update: 2018-01-23 04:27 GMT
ఓ విషయాన్ని చెప్పేందుకు ఎక్స్ ట్రీమ్ కంపారిజన్స్ ఇవ్వడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. తనకు ఏదైనా బాగుందని అనిపిస్తే ఇక ఇంతకంటే ఆ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమం ఏదీ లేదనే ఫీలింగ్ ని జనాలపై రుద్దేందుకు ట్రై చేస్తుంటాడు. అఫ్ కోర్స్.. ఇదంతా కేవలం ఆ పర్టిక్యులర్ టైంలోనే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయ్యాక మళ్లీ కొత్త కాన్సెప్ట్ ను పట్టుకున్నపుడు ముందు తనే చెప్పిన విషయాలను కూడా పట్టించుకోడు.

ప్రస్తుతం జీఎస్టీ అంటూ.. గాడ్ సెక్స్ అండడ్ ట్రూత్ పేరుతో ఓ షార్ట్ ఫిలిం తీస్తున్నాడు వర్మ. జనవరి 26న ఉదయం గంటలకు ఈ జీఎస్టీని విడుదల చేయబోతున్నాడు. దీనికి పబ్లిసిటీ చేసేందుకు ఇప్పటికే అన్ని రకాల ట్రిక్కులు ప్రయోగిస్తున్న వర్మ కన్ను.. ఇప్పుడు పద్మావత్ పై పడింది. ఆ ముందు రోజున విడుదల అవుతున్న దీపికా పదుకొనే మూవీ పద్మావత్ కు.. తను తీసిన జీఎస్టీ పోటీ అనేస్తున్నాడు. అంతే కాదు.. బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనే.. పోర్న్ స్టార్ మియా మల్కోవాల మధ్య పోటీ అని కూడా చెప్పిన వర్మ.. ఎవరు ఉత్తమ మహిళ అనే సంగతి కూడా తేలుతుందనే అర్ధం వచ్చేలా ట్వీట్ పెట్టాడు.

పోర్న్ మూవీకి పారలల్ గా తను తీస్తున్న సినిమాను.. రాజరిక సాంప్రదాయాల బేస్డ్ సాగుతున్న సినిమాతో కంపేర్ చేయడం వర్మకే చెల్లింది. అంతేలే.. పూరీ తన కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ మూవీ తీస్తుంటే.. దీంతో పోల్చితే మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి ఫ్లాప్ అన్నవాడికి.. ఇంతకంటే గొప్ప థాట్స్ వస్తాయని భావించడం అత్యాశే.



Tags:    

Similar News