ఓ కామెంట్ అంటూ చేసిన తర్వాత సాధారణంగా రామ్ గోపాల్ వర్మ దానికి కట్టుబడే ఉంటాడు. మాట అనే ముందు ఆలోచిస్తాడో లేదో చెప్పలేం కానీ.. అన్న తర్వాత మాత్రం దాన్ని సమర్ధించుకునేందుకు 100 మాటలు చెబుతుంటాడు. అంతే తప్ప తన మాటలను ఉపసంహరించుకోవడం.. చేసిన కామెంట్స్ కు సారీ చెప్పడం లాంటివి అస్సలు అలవాటు లేని అరుదైన వ్యక్తి వర్మ.
కానీ మహిళా దినోత్సవం సందర్భంగా తాను చేసిన సన్నీ లియోన్ కామెంట్స్ కు సారీ చెప్పాడు వర్మ. ఈ ప్రపంచంలో మహిళలంతా సన్నీలియోన్ మాదిరిగా మగవాళ్లకు ఆనందం పంచాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పోలీస్ కేసులు పెట్టే వరకూ పరిస్థితి వచ్చింది. 'నేను కేవలం నా భావాలను చెప్పానంతే. కానీ మహిళా దినోత్సవం రోజున ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా.. నేను చేసిన అసంబద్ధమైన వ్యాఖ్యల కారణంగా.. బాధ పడ్డ ప్రతీ వారికి క్షమాపణ చెబుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.
ఇక్కడితో ఆగిపోతే అది వర్మ ట్వీట్ అవదు కదా. 'నా క్షమాపణ కేవలం నిజంగా నిజాయితీగా బాధ పడ్డవారికి మాత్రమే. అంతే తప్ప పబ్లిసిటీ కోసం హంగామా చేసిన వారికి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామని బెదిరించిన వాళ్లకు కాదు' అంటూ తన సారీలో అప్లై అయ్యే కండిషన్స్ కూడా మరుసటి ట్వీట్ లోనే చెప్పాడు సంచలన ట్వీట్స్ వేసే రామ్ గోపాల్ వర్మ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/