లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎప్పుడు విడుదలవుతుందో కాని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చేసుకుంటున్న పబ్లిసిటీ దాని ట్రైలర్ కి మిలియన్లలో వ్యూస్ ని తెచ్చి పెడుతోంది. ఇప్పటికిప్పుడు దీన్ని మహానాయకుడుతో సమానంగా విడుదల చేస్తే ఇదే ముందు హౌస్ ఫుల్ అవుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. అసలు ఎవరు పట్టించుకోలేని స్థితికి తన సినిమాలను తెచ్చుకున్న వర్మకు ఇదంతా ఆనందం కలిగించే పరిణామమే. తాను కలుసుకుంటున్న వ్యక్తులను కూడా వర్మ సినిమాకే ముడిపెడుతూ ఏదో ఒక టాపిక్ డిస్కషన్ లో ఉండేలా చూసుకుంటున్నాడు.
తాజాగా బామ్మ పాత్రలకు బాగా పేరున్న ఒకప్పటికి క్యారెక్టర్ అరిస్ట్ రమాప్రభను వర్మ కలుసుకున్నాడు. ఆవిడతో పంచుకున్న జ్ఞాపకాలను చెప్పుకుని మురిసిపోతూ ఫోటోలు ట్వీట్ చేసాడు. అక్కడితో వదిలేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు రమాప్రభను కలుసుకున్న ఆనందాన్ని వ్యక్తపరుస్తూనే ఆవిడ తనకు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఎన్నో ఎన్నెన్నో చీకటి రహస్యాలను షేర్ చేసుకున్నారని చిన్న క్లూ ఇచ్చాడు.అవన్నీ సినిమాలో పొందుపరుస్తాడా లేదా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు.
దాదాపు షూటింగ్ పూర్తయ్యే స్టేజి లో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఆవిడ చెప్పిన నిజాలు పెడతాడా అన్నది అనుమానమే. రమాప్రభ గారు ఎన్టీఆర్ ను దగ్గరుండి చూసిన వాళ్లలో ఉన్నారు. దశాబ్దాల అనుభవం కాబట్టి చాలా విషయాల పట్ల అవగాహన ఉండే ఉంటుంది. అయితే ఆవిడ ఏ కోణంలో చెప్పారో కాని వర్మ మాత్రం ఈ కలయికను కూడా ఇలా సినిమాకే వాడుకోవడం అతనికే చెల్లింది