వివాదాలు.. సంచలనాలు దర్శకుడు రాంగోపాల్ వర్మకు కొత్తేం కాదు. ఆయన నిత్యం వాటి వెంటే తిరుగుతుంటారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో.. సినీ.. రాజకీయ రంగాల్లో ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాణం వెనుక రాజకీయ అంశాలు ఉన్నాయన్న విమర్శ ఉంది. అయితే.. దీన్ని ఇప్పటివరకూ కొట్టేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఒక సంచలన ట్వీట్ చేశారు వర్మ. ఎన్టీవోడంటే విపరీతంగా అభిమానించి.. ఆరాధించే నిజాయితీపరులైన ఎన్టీఆర్.. తారక్ అభిమానులు.. తమ ఓటును సినిమా చూసిన తర్వాతే వేయాలని కోరారు.
ఇక్కడితో ఆగితే వర్మ ఎందుకు అవుతారు. తన ట్వీట్ లో మరో సంచలనానికి తెర తీశారు. టీడీపీకి అసలుసిసలు వారసుడు లోకేశ్ కాదని.. జూనియర్ ఎన్టీఆర్ అంటూ తారక్ అధికారిక ట్విట్టర్ ఖాతా ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసిన వైనం ఇప్పుడు కొత్త కలకలానికి దారి తీస్తుందని చెప్పక తప్పదు. సినిమా చూశాక ఓటు వేయాలని కోరిన వర్మ ట్వీట్ కొత్త వివాదానికి తెర తీసినట్లుగా పలువురు అభిప్రాయ పడుతున్నారు.