నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సొంత బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ అంచనాలు ఉండడం తో బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' కు పెద్ద స్థాయిలో బిజినెస్ జరిగింది. కానీ ఇప్పుడేమో సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ల లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. సినిమా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు.. క్రిటిక్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. మరి ఎక్కడ తేడా కొట్టింది?
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఈ సినిమా డిజాస్టర్ కావడానికి చాలా కారణాలే ఉన్నాయని చర్చలు సాగుతున్నాయి గానీ ముఖ్యంగా ముగ్గురు మాత్రం ఈ సినిమా ఫలితాన్ని తారుమారు చేయడంలో కీలకపాత్ర పోషించారని అంటున్నారు. ఈ ముగ్గురు సినిమాకు సంబంధం లేని వారు కావడం విశేషం. ఆ ముగ్గురు ఎవరో కాదు.. నాగబాబు.. రామ్ గోపాల్ వర్మ.. నాదెండ్ల భాస్కర రావు.
నందమూరి బాలకృష్ణ గతంలో మెగా ఫ్యామిలీ గురించి తేలికగా మాట్లాడినందుకు నాగబాబు భారీగా దాడి చేశారు. సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయారు. కొంతమంది మేథావులు నాగబాబు దాడిని తప్పుపట్టినా సాధారణ జనాలు మాత్రం నాగబాబు చేసింది కరెక్ట్ అనే భావనలో ఉండడం ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపించిందని అంటున్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ చేసిన హాడావుడితో అసలు లక్ష్మీ పార్వతి పేరు పెద్దగా తెలియని ఈ జెనరేషన్ వారు అందరూ పాత వీడియోలు చూసి మరీ 'నిజాలు' ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. అంతే కాకుండా వర్మ అసలు బయోపిక్ తమదేనని.. పెద్దాయన ఆశిస్సులు ఉంటాయని చెప్పడం చాలామందిలో ఆలోచనలను రేకేత్తించింది. ఈ విషయాలను కౌంటర్ చేసేవారు లేకపోవడంతో అవి నిజాలని చాలామంది నమ్ముతున్నారు.
ఈ ఇద్దరూ చాలదన్నట్టు నాదెండ్ల భాస్కర రావు ఇంటర్వ్యూలు కూడా ఎన్టీఆర్ బయోపిక్ పరాజయంలో తమ పాత్ర పోషించాయని అంటున్నారు. ఎన్నో ఏళ్ల నుండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ఆయన తాజా ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ ను దేవుడిని చేస్తే.. నాదెండ్ల తన ఇంటర్వ్యూ లలో ఎన్టీఆర్ లోని నెగెటివ్ యాంగిల్ అంతా పూసగుచ్చినట్టు వివరించారు. అవన్నీ నిజాలో కాదో పక్కన బెడితే.. ఎన్టీఆర్ జీవితంలో నాణేనికి మరో వైపు అన్నది నాదెండ్ల ఇంటర్వ్యూల ద్వారా జనాలకు తెలిసింది.
ఈ ముగ్గురి దెబ్బకు సగంమందికి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పోయిందని.. 'మహానటి' లా ఎన్టీఆర్ లోని పాజిటివ్.. నెగెటివ్ రెండు పార్శ్వాలను చూపించే ఒక సిన్సియర్ ప్రయత్నం ఉంటుందని జనాలకు నమ్మకం కలగకపోవడం ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ముగ్గురి తో పాటుగా ఎన్టీఆర్ ను ఒక క్యాస్ట్ ఓన్ చేసుకొని దేవుడిలా ప్రాజెక్ట్ చేస్తూ ఉండడం అనేది మిగతా కమ్యూనిటిల వారికి చిరాకు తెప్పించిందని.. దాంతో సినిమాకు కావాలని వారందరూ దూరంగా ఉన్నారని కూడా ఒక వాదన కూడా వినిపిస్తోంది. ముందే అనుకున్నట్టు.. కర్ణుడి చావుకు లక్ష కారణాలు. ఈ ఫ్లాపుకు కూడా అదే లాజిక్ వర్తిస్తుంది.
Full View