క్యాస్టింగ్ కౌచ్ కు అంతం లేదు: వ‌ర్మ

Update: 2018-04-14 09:51 GMT

శ్రీ‌రెడ్డి ఎపిసోడ్ త‌ర్వాత టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విలక్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క్యాస్టింగ్ కౌచ్ పై త‌న‌దైన శైలిలో స్పందించారు. సినీ ఇండ‌స్ట్రీలో గ‌తంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని, ఇపుడు కూడా జ‌రుగుతోంద‌ని, భ‌విష్య‌త్తులో కూడా జ‌రుగుతూనే ఉంటుంద‌ని వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి క్యాస్టింగ్ కౌచ్  - ఎక్స్ ప్లాయిటేష‌న్ అనేవి ఇండ‌స్ట్రీలో పాతుకుపోయాయ‌ని....ఒక హోదాలో ఉన్న బ‌ల‌వంతుడైన వ్యక్తి....త‌న ద‌గ్గ‌ర‌కు అవ‌కాశాల కోసం వ‌చ్చిన అమ్మాయిల‌పై చేసే దోపిడీనే క్యాస్టింగ్ కౌచ్ అని అన్నారు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఇది బ‌ల‌వంతుడికి ...బ‌ల‌హీనుల‌కు మ‌ధ్య జ‌రిగే వ్య‌వ‌హారం వంటిద‌ని అన్నారు. దాదాపుగా ఇండ‌స్ట్రీలో వ‌చ్చే ప్ర‌తి అమ్మాయి కాంప్ర‌మైజ్ అనే వ్య‌వ‌హారం ఫేస్ చేయాల్సిందేన‌ని, అయితే, ఇండ‌స్ట్రీలోని బ‌డా ఫ్యామిలీలు - పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిల‌కు స‌డ‌లింపు ఉంటుంద‌ని చెప్పారు.

గ‌తంలో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఈ ఎక్స్‌ ప్లాయిటేషన్ వ్య‌వ‌హారం పీక్స్ లో ఉండేదని వ‌ర్మ అన్నారు. ఆ రోజుల్లో ఒక అమ్మాయి బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమాల్లో న‌టిస్తోందంటే ఇండ‌స్ట్రీ వాళ్లు అగౌర‌వంగా చూసేవార‌ని, 60-70ల్లో ఈ క‌ల్చ‌ర్  వరస్ట్ గా ఉండేదని అన్నారు. ఇప్ప‌డు చ‌ట్టాలు రావ‌డం, మీడియా ప‌రిధి పెర‌డ‌గం వ‌ల్ల త‌మ‌కు అన్యాయం జ‌రిగిన అమ్మాయిలు కేసులు పెట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. అయితే, దాదాపుగా చిన్న సినిమాల నిర్మాత‌లు ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల‌కు పాల్ప‌డ‌తార‌ని, రియ‌ల్ ఎస్టేట్ ల‌లో సంపాదించిన డ‌బ్బులు పెట్టి సినిమా తీస్తార‌ని, వారికి సినిమా క‌న్నా క్యాస్టింగ్ కౌచ్ ముఖ్య‌మ‌ని అన్నారు. ఈ వ్య‌వ‌హారం ....కో ఆర్డినేటర్ ద‌గ్గ‌ర మొద‌ల‌వుతుంద‌ని, అత‌డు ఓ ర‌కంగా బ్రోకరేనని.. ఒక అమ్మాయి సినిమాల్లోకి రావాలంటే.. వాడితో కూడా కాంప్రమైజ్ కావాల్సిన ప‌రిస్థితులున్నాయ‌ని వర్మ తెలిపారు. ఒక సినిమా కోసం 50 ఫోటోలు పంపిస్తే.. వాటిల్లో 10  మంది అమ్మాయిలు  కాంప్రమైజ్ కు రెడీ అని సెప‌రేట్ లిస్టు పంపుతార‌ని చెప్పారు. త‌న‌కు మాత్ర‌మే కాద‌ని, ఇండస్ట్రీలోని ప్రతి డైరెక్టర్‌ కూ ఇలాగే పంపిస్తాడ‌ని చెప్పారు. ఆ కో ఆర్డినేట‌ర్ దానిని ఒక జాబ్  లా ఫీల్ అవుతాడ‌ని, అత‌డికి వేరే టాలెంట్ లేదు కాబ‌ట్టి ఇలా  డబ్బు సంపాదిస్తున్నాడ‌ని చెప్పారు.

అయితే... వ‌ర్మ చెప్పిన మాట‌లు చేస్తే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏవో కొన్ని పోరాటాల‌తోనే అంతం అయ్యేది కాదు, ఒక్క‌ అవ‌కాశం అనే బ‌ల‌హీన‌త‌ను సొమ్ము చేసుకునే వారు ఉన్నంత కాలం సాగుతూనే ఉంటుంది.
Tags:    

Similar News