#RGV విశాఖ తీరంలో వేట క‌త్తులు

Update: 2019-12-31 17:30 GMT
క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అంటూ ఆర్జీవీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 2019 బెస్ట్ ట్రీట్ ఇదేన‌ని చెప్పాలి. అయితే ప్ర‌మోష‌న్స్ లో ఉన్నంత సినిమాలో లేద‌ని తేలిపోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ త‌ప్ప‌లేదు. ప్ర‌చారార్భాటం త‌ప్ప మ్యాట‌ర్ లేకుండా సినిమాల్ని చుట్టేస్తుండ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప్ర‌స్తుతం బ్యూటిఫుల్ అంటూ ప్ర‌మోష‌న్స్ లో ఆర్జీవీ చేస్తున్న ర‌చ్చ వైర‌ల్ గా చ‌ర్చ‌కొచ్చింది. క‌థానాయిక‌తో క‌లిసి ఆర్జీవీ డ్యాన్సులు చేస్తూ వీరంగం సృష్టిస్తున్నాడు.

అలాగే డ్రాగన్ కంట్రీ చైనా స‌హా స్వ‌దేశంలో `ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్` అనే సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఆ త‌ర్వాత ఏ సినిమా తీయ‌బోతున్నాడు? అంటే.. `విశాఖ తీరంలో వేట క‌త్తులు` అనే టైటిల్ ని తెర‌పైకి తెచ్చాడు. ప్ర‌స్తుతం అమరావతి నుంచి విశాఖకు రాజధానిని త‌ర‌లిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఇదే బ‌ర్నింగ్ టాపిక్ తో సినిమాకి శ్రీ‌కారం చుట్టేస్తున్నాడు.

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు త‌ర‌హాలోనే `విశాఖ తీరంలో వేట కత్తులు` పేరుతో మ‌రోసారి వివాదాస్ప‌ద అంశాన్ని తెర‌పైకి తెస్తాడా?   రాజ‌ధాని పేరుతో వంద‌లాది ఎక‌రాలు కొన్న వారిపైనా సెటైర్లు వేస్తాడా?  అస‌లేం తీయ‌బోతున్నాడు? ఏపీ రాజ‌కీయాలు ర‌స‌ప‌ట్టులో ఉన్న ఇలాంటి వేళ వ‌ర్మ ఏం తీసినా అదో సంచ‌ల‌న‌మే అవుతుంది మ‌రి. ఇక రాజ‌ధాని అమ‌రావ‌తి లో పెడితే ఏంటి.. విశాఖ‌లో పెడితే ఏంటి..! అని ఆర్జీవీ ఇంత‌కుముందు ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News