ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ప్రచారార్భాటంతో జనాల్లోకి దూసుకెళ్లడం అతడి శైలి. అయితే కేవలం ఈ ఆర్భాటమే అతడి విజయానికి సాయమవుతుందా? అంటే సందేహమే. దొంగలబండి - ఐస్ క్రీమ్ .. అంటూ నాశిరకం సినిమాలు తీసి జనాలపైకి రుద్దుదామంటే అందుకు తగ్గట్టే ధీటైన జవాబు ఇచ్చారు ప్రేక్షకులు. బాక్సాఫీస్ వద్ద దారుణ వైఫల్యాలు తప్పలేదు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సన్నివేశమేంటి? అంటే.. కాస్త వివరంలోకి వెళ్లాలి.
టాలీవుడ్ లో వరుసగా సినిమాలు తీస్తూ.. ప్రచారం కోసం ఇతరుల్ని వాడేస్తూ తెలివైన గేమ్ ప్లాన్ తో ఆర్జీవీ ముందుకెళుతున్నాడు. సందర్భం వస్తే ఎవరినైనా వాడేసేంత సమర్ధుడు ఆర్జీవీ. ఇదివరకూ తన శిష్యుడు తీసిన ఓ సినిమా ప్రచారానికి 600కోట్ల బడ్జెట్ సినిమా 2.0 ని ఉపయోగించుకున్నాడు. ప్రస్తుతం `లక్ష్మీస్ ఎన్టీఆర్` .. ఎన్టీఆర్ అసలు బయోపిక్ ఇదే! అంటూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నాడు. ఇందుకోసం బాహుబలి.. లక్ష్మీ పార్వతి.. కె.ఏ.పాల్ - ఏసు ప్రభువు.. ఇలా అందరినీ తన ప్రమోషన్స్ కి వాడేస్తున్నాడు. కట్టప్ప బాహుబలికి వెన్నుపోటు పొడిచిన ఫోటోనే అందుకు ఉపయోగించుకుంటున్నాడు. ఎన్టీఆర్ ని చంద్రబాబు ఇలానే వెన్నుపోటు పొడిచాడంటూ ఒకటే ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ ఫోటో లీక్స్ ప్రచారం.. టీజింగ్ ట్యాంపరింగ్ పబ్లిసిటీ స్టంట్.. సినిమా హిట్టుకి కలిసొస్తుందా? అంటే సందేహమే.
సినిమాలో విషయం ఉంటేనే జనం ఆదరిస్తారు. మౌత్ టాక్ బావుండేంత గొప్పగా తీస్తేనే జనం థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారు. అంతేకాదు బయోపిక్ లు తీస్తే ఎంతో బ్యాలెన్స్ డ్ గా తీయాల్సి ఉంటుంది. నిజాలు చెబుతూనే కమర్షియలైజ్ చేసి విజువల్స్ ని ఆవిష్కరించడంలో సత్తా చూపించాల్సి ఉంటుంది. ఇక అంత గొప్పగా తీసినా నిరాదరణకు గురైన కథానాయకుడు ఫలితం ఇప్పుడు వర్మ ముందు ఓ ఛాలెంజ్ ని ఉంచింది. పైగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` కి ఆర్జీవీ ఎంత ప్రచారం చేయాలనుకున్నా.. ఆ సినిమాని మీడియా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్జీవీ చివరికి ఏసు ప్రభువుని.. కెఏ పాల్ ని వదల్లేదు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నాడు వర్మ. ``ప్రభువా! నేను పాల్ కాళ్ళు ముట్టుకోలేదు.. జస్ట్ పట్టుకుని గట్టిగా లాగితే వెనక్కి పడి తల నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా .. కాని మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేసా!!`` అంటూ కొంటెగా కామెంట్ ని పోస్ట్ చేశాడు వర్మ. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్జీవీ `వాడకం` ఏ రేంజులో ఉంటుందో?! సందర్భం ఏదైనా.. వ్యక్తులు ఎవరైనా తన ప్రచారానికి ఉపయోగపడాలి అంతే!! ఆర్జీవీ ఏంటిది.. నువ్వు మారవా.. ఎప్పటికీ ఇంతేనా!!
Full View