వర్మ పెద్ద డ్యామేజే చేస్తాడా?

Update: 2019-03-11 04:30 GMT
ఎన్నికల ప్రకటన వచ్చేసింది. సరిగ్గా నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మారబోతోంది. తెలంగాణాలోనూ లోక్ సభ ఎలక్షన్స్ జోరు ఉంటుంది. ఇధిలా ఉండగా రాజకీయ వర్గాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన చర్చ మరింత వేడి రాజుకుంటోంది. ఇది ఎక్కడ తమ నాయకుడికి నెగటివ్ ఇమేజ్ తెచ్చి కొంప ముంచుతుందో అని ఒకపక్క టిడిపి శ్రేణులు భయపడుతుండగా అదేమీ జరగదని అప్పట్లో కృష్ణ గారి బ్యాచ్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎన్ని సినిమాలు తీసినా రెండో సారి సిఏం అయ్యారని అధిష్టానం ఉదాహరణలు చెబుతోందట.

కాని అప్పటి పరిస్థితులు ఇప్పటి వాతావరణానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సోషల్ మీడియా-టెక్నాలజీ-4జి విప్లవం లాంటివెన్నో ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు ట్రైలర్లు కలిపి ఇప్పటికే ఐదు కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడం కన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఇంకేం కావాలి. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చెప్పిన టైంకి  మార్చ్ 22న విడుదల అవుతుందా లేదా అనేదే భేతాళ ప్రశ్న. కోర్ట్ ద్వారా నందమూరి నారా కుటుంబాలు అడ్డుకుంటాయని ఇప్పటికే టాక్ ఉంది. కాని ఆ సూచనలు ఏమి కనిపించడం లేదు.

ఒకవేళ అదే పని చేస్తే వర్మ అన్నట్టు ఏ యుట్యూబ్ లోనో అమెజాన్ ప్రైమ్ లోనో నేరుగా వదిలాడంటే అంతే సంగతులు. థియేటర్లో ఓ పాతిక శాతం చూస్తారు అనుకుంటే ఇలా ఆన్ లైన్లోకి ఫ్రీగా వచ్చేస్తే అది రెండు వందల శాతం దాటినా ఆశ్చర్యం లేదు. అప్పుడు జరిగే డ్యామేజీని ఊహించుకోవడం కూడా కష్టమే. సెన్సార్ అయ్యేదాకా దీని గురించి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సర్టిఫికేట్ చేతికి వచ్చిందా వర్మని ఆపడం ఇంకెవరి తరం కాదు.
Tags:    

Similar News