వీరప్పన్ మీద ఆల్రెడీ తమిళంలో ఓ సినిమా వచ్చింది. అది అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అయినా రామ్ గోపాల్ వర్మ మళ్లీ ‘కిల్లింగ్ వీరప్పన్’ అంటూ ఓ సినిమా తీశాడు. విడుదలకు సిద్ధం చేశాడు. ఐతే ఇంతకీ వర్మ సడెన్ గా వీరప్పన్ మీద ఎందుకు పడ్డాడు? ఈ సినిమా తీయాలని ఆయనకెందుకు అనిపించింది. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘వీరప్పన్ వ్యవహారం నాకు ఎప్పట్నుంచో ఆసక్తిగా అనిపించేది. నేను బాలీవుడ్ లో ఉండగా పన్నెండేళ్ల కిందట ‘లెట్స్ క్యాచ్ వీరప్పన్’ అనే సినిమా నిర్మించాలనుకున్నాను. ‘చక్ దే ఇండియా’ ఫేమ్ షిమిత్ అమిన్ దర్శకత్వంలో ఈ సినిమా తీయాలనుకున్నా. ముగ్గురు వ్యక్తులు వీరప్పన్ మీద ఉన్న రివార్డ్ మనీ కోసం అతణ్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. అదీ కథ. కానీ మేం సినిమా మొదలుపెడదాం అనుకుంటుండగానే వీరప్పన్ ను చంపేశారు. ఇక చనిపోయిన వ్యక్తిని వెతికి పట్టుకోవటం అనే పాయింట్ మీద సినిమా తీయటం అర్ధం లేదని ఆపేశా. తర్వాత వీరప్పన్ జీవిత చరిత్ర మీద సినిమా తీయాలనే ఆలోచన కూడా వచ్చింది. కానీ అప్పటికే వీరప్పన్ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ పుస్తకాలు - డాక్యుమెంటరీల ద్వారా జనాలకు తెలిసిపోయాయి. అందుకే ఆలోచన కూడా పక్కనబెట్టేశా. ఐతే ఏడాది క్రితం కన్నన్ అనే పోలీస్ అధికారి గురించి విన్నా. ఆయన వీరప్పన్ ను చంపే ఆపరేషన్ కు హెడ్.
అప్పటివరకు కన్నన్ కంటే ముందొచ్చిన పోలిసులందరూ వీరప్పన్ ను అడవి లోపల వేటాడి పట్టుకోవాలనుకున్నారు. కానీ కన్నన్ మాత్రం అతణ్ని అడవి నుంచి బయటకు రప్పించాలనుకున్నాడు. ఆ ఆపరేషన్ అసలు ఎలా జరిగిందో తెలుసుకున్నా.. నా ఉత్సాహానికి అడ్డు లేకపోయింది. ఆ వివరాలు జనాలందరికీ తెలియాలనే ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా తీశా’’ అని చెప్పాడు వర్మ.