ప‌ట్ట‌ప‌గ‌లు రిలీజ్‌ కి రాదా?

Update: 2015-12-05 05:15 GMT
రాజ‌శేఖ‌ర్ హీరోగా రామ్‌ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్ట‌ప‌గ‌లు అనే హార‌ర్ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇదో హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ. అప్ప‌ట్లో టీజ‌ర్ రిలీజై బావుందే అన్న టాక్ తెచ్చుకుంది. ఇందులో స్వాతి ధీక్షిత్ దెయ్యం ప‌ట్టిన అమ్మాయిగా చ‌క్క‌ని అభిన‌యం చూపించింది. రాజ‌శేఖ‌ర్ - స్వాతిధీక్షిత్ తండ్రి కూతుళ్లుగా న‌టించారు. దెయ్యం ప‌ట్టిన కూతురిని బాగు చేసేందుకు ఓ తండ్రి ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడ‌న్న‌దే సినిమా.

ఈ మూవీ తెర‌కెక్కి ఇప్ప‌టికే ఏడాది పైగానే అయ్యింది. గ‌త ఏడాది మేలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసినా .. ఇంత‌వ‌ర‌కూ ఈ సినిమా జాడైనా లేదు. అయితే ఈ  మూవీలో కొన్ని స‌న్నివేశాల్ని రీషూట్ చేయాల‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ భావిస్తున్నారట‌. అందుకు రామ్‌ గోపాల్ వ‌ర్మ ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌లేద‌ని, అందుకే ఇది రిలీజ్ కి రాకుండా ల్యాబుకే ప‌రిమిత‌మైంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.  కార‌ణం ఏదైనా ఈ మూవీ రిలీజ్ ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఓ వైపు రాజ‌శేఖ‌ర్ త‌న త‌దుప‌రి సినిమాల కోసం వెయిటింగ్‌ లో ఉన్నారు. ఓ పెద్ద సినిమా చేయాలని అనుకుంటున్నారు. క్యారెక్ట‌ర్ న‌టుడిగానూ నిరూపించుకోవాల‌ని కొత్త ప్ర‌య‌త్నం ప్రారంభించార‌ని తెలుస్తోంది. ఇక ప‌ట్ట‌ప‌గ‌లు రిలీజ్‌ కి రానట్టేనా?

పైగా రామ్‌ గోపాల్‌ వర్మ ఈ సినిమా కోసం ఎంతో బడ్జెట్‌ పెట్టించలేదట. సో.. సినిమా రిలీజ్‌ కాకపోయినా వచ్చే లాస్‌ అంతగా ఏమీ ఉండదు అంటున్నారు ట్రేడ్‌ వర్గాలు.
Tags:    

Similar News