'అమ్మల అమ్మకే అమ్మ'తో నేను!!

Update: 2016-09-27 17:20 GMT
వామ్మో పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మిడ్ నైట్ దండయాత్రను మొదలెట్టేశాడు. దాదాపు 9 గంటలు దాటితే చాలు రోజూ ఏదో ఒకటి చెబుతూ అలరిస్తూనే ఉన్నాడు. అందరికీ పడుకునే ముందు రాము ట్విట్టర్ పేజీని ఓసారి చూస్తే కాని పడుకోవట్లేదు. అలా అయిపోయింది పరిస్థితి.

కొన్ని రోజుల పాటు తన సినిమాల గురించి మాట్లాడకుండా.. పింక్ సినిమా గురించి.. అమితాబ్ బచ్చన్ గురించి.. కత్రినా కైఫ్‌ కు వచ్చిన స్మితా పాటిల్ అవార్డు గురించి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మాత్రం మరోసారి తన సినిమాల గురించి మాట్టాడటం మొదలుపెట్టాడు. నయీమ్ అనుచరులు తనను బెదిరిస్తున్నారని.. కాని తాను మాత్రం నయీమ్ కా బాప్ అన్నట్లు గత రాత్రి కలరింగ్ ఇచ్చాడు. ఇప్పుడేమో గతంలో జయలలిత దగ్గర నుండి ఏదో అవార్డును తీసుకుంటున్న ఫోటో ఒకటి షేర్ చేసి.. 'అమ్మల అమ్మకే అమ్మ'తో నేను అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు.

అసలు ఈ ఫోటోను షేర్ చేసిన నేపథ్యం ఏంటో తెలియదు కాని.. ఒక ప్రక్కన సుప్రీమ్ కోర్టు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటకను తిరిగి అదేశించిన నేపథ్యంలో రాము ఇలా ట్వీట్ చేయడం.. ఏదో ఇన్ డైరక్టు మెసేజ్ ను ఇస్తున్నాడని మనం అనుకోవచ్చేమో.
Tags:    

Similar News