వివాదాలతోనే ఓపెనింగ్స్ తెచ్చుకునేలా ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఇంకో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. సెన్సార్ కు సంబంధించిన అప్ డేట్ తప్ప వర్మ అన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే కాపీ ఆఫీస్ కు వెళ్లిందని అధికారుల నుంచి ఇంకా ఎలాంటి క్లియరెన్స్ రాలేదని ఓ టాక్ అయితే ఉంది కానీ ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉంది. చేతిలో ఉన్నది తక్కువ వ్యవధి కాబట్టి వర్మ ప్రమోషన్ వేగాన్ని ఇంకాస్త పెంచాడు.
ఇందాకా ఫేస్ బుక్ ట్విట్టర్లలో ఓ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ వాడు నా పిల్లలు కలిసి నన్ను వెన్నుపోటు పొడిచారు అనే హెడ్డింగ్ తో అదే పనిగా హై లైట్ చేయడం చూస్తే ఇలా నారా నందమూరి అభిమానులకు పోట్లు పొడుస్తూనే పబ్లిసిటీ చేసుకునే వర్మకు అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల కావడం లేదు.చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేక చాలా డ్రైగా ఉన్న మార్చ్ నెలలో అంతో ఇంతో హైప్ ఉన్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక్కటే. అల్లు శిరీష్ ఏబిసిడి అన్నారు కానీ ఒక ఆడియో సింగల్ ని రిలీజ్ చేయడం మినహాయించి ఇప్పటి దాకా ఎలాంటి ఈవెంట్ కానీ ప్రమోషన్ కానీ ప్లాన్ చేయలేదు. సో అదే డేట్ కు దాదాపు లేనట్టే.
నిఖిల్ అర్జున్ సురవరం 29 అన్నారు కాబట్టి దానికి ఇంకా టైం ఉంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ సోలోగా బరిలో దిగితే మాత్రం సాధారణంగా ఆశించిన ఓపెనింగ్స్ కన్నా అధికంగా రావడం అయితే ఖాయం. టాక్ ని నిలబెట్టుకుంటేనే రన్ మీద అంతో ఇంతో ఆశలు పెట్టుకోవచ్చు. కంటెంట్ తో మెప్పించే విషయంలో ఏమైనా తేడా వస్తే ఏం జరుగుతుందో వర్మకు తెలిసినంత ఇండస్ట్రీలో ఇంకెవరికి తెలియదు. సో వేచి చూద్దాం