వర్మ ఆత్మహత్య చేసుకుంటాడట.. ఎప్పుడు?

Update: 2017-01-02 14:40 GMT
అవును.. రామ్ గోపాల్ వర్మ ఆత్మహత్య చేసుకుంటాడట. కానీ అది ఇప్పుడు కాదు. తనకు వయసు మీద పడి ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినపుడు తన ప్రాణాలు తానే తీసుకుంటానని చెప్పాడు వర్మ. ఎవరి మీదా ఆధారడపడటం తనకు ఇష్టముండదని.. అందుకే అలాంటి పరిస్థితి వచ్చినపుడు ఆత్మహత్య చేసుకుంటానని వర్మ స్పష్టం చేశాడు. తాను ఎప్పుడూ ఆరోగ్యంగా  ఉంటానని.. జ్వరం కూడా అరుదుగా వస్తుందని.. ఆ టైంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడనని వర్మ చెప్పాడు.

ప్రేక్షకులు తనను ఇలా గుర్తుపెట్టుకోవాలని తనకు ఎలాంటి ఆలోచనలూ లేవని.. ఈ విషయంలో తనది డోంట్ కేర్ యాటిట్యూడ్ అని వర్మ చెప్పాడు. ఎవరైనా మీకు డాక్టరేట్ ఇస్తానంటే తీసుకుంటారా అని అడిగితే.. నాకు డాక్టరేట్ ఇచ్చేంత నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడూ లేడని నా ఫీలింగ్ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు వర్మ. కేసీఆర్ మీద తీస్తానన్న సినిమా సంగతేంటి అని అడిగితే.. ‘వెయిట్ అండ్ సీ’ అని బదులిచ్చిన వర్మ.. తెలుగులో ప్రస్తుతానికి ఇంకో సినిమా చేయాలన్న ఉద్దేశమైతే లేదన్నాడు. ‘న్యూక్లియర్’ సినిమా మేలో మొదలవుతుందని.. ఇంగ్లిష్ లో తెరకెక్కే ఈ సినిమా పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగా సమయం పడుతుందని వర్మ తెలిపాడు.

రాజమౌళి సినిమాలు తనకు పెద్దగా నచ్చవు అంటూనే ఈ మధ్య అదే పనిగా అతణ్ని పొగడ్డంపై స్పందిస్తూ.. ‘‘రాజమౌళి సినిమాలు నాకు నచ్చడం.. నచ్చకపోవడం అనేది నా పర్సనల్‌ ఫీలింగ్‌. కానీ తెలుగు సినిమా మార్కెట్‌ కు ఇంత పొటెన్షియాలిటీ ఉందని నిరూపించాడు. ఆ ఘనతను తక్కువగా చూడలేం’’ అని వర్మ బదులిచ్చాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News