రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించాడు. అయితే ఇప్పటి వరకు ఆయన వివాదాస్పద సినిమాలు ఒక ఎత్తు అయితే తాజాగా తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం మరో ఎత్తు. నందమూరి తారక రామారావు చివరి రోజులను తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నాడు. అయితే ఈ సినిమాను తాను ఎందుకు తీయాల్సి వచ్చిందో అనే విషయాన్ని దర్శకుడు వర్మ ఒక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేశాడు.
ఆ వాయిస్ మెసేజ్ లో వర్మ.. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓడిపోయారు. అధికారం కోల్పోయిన ఆయన ఆరోగ్యం పాడైంది. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పట్టించుకోక పోవడంతో ఏకాకి అయ్యాడు. ఆ సమయంలో లక్ష్మీ పార్వతి అనే స్త్రీ ఆయన జీవితంలోకి ప్రవేశించింది. వారిద్దరి మద్య మొదలైన సంబంధం రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చేసింది, ఆ సంబంధం ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా మార్చింది అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నాము.
25 సంవత్సరాలుగా కొన్ని అబద్దాలు నిజాలుగా చెలామణి అవుతున్నాయి, నిజాలను గోతిలో పాతి పెట్టారు. రాజకీయ మోసగాళ్ల మొహం మీద ఉన్న ముసుగును ఈ చిత్రంతో తీసేస్తానంటూ వర్మ చెబుతున్నాడు. ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతిల మద్య ఏర్పడిన సంబంధం - ఆ తర్వాత జరిగిన పరిణామాలు వైస్రాయ్ ఉదంతం సమయంలో ఎన్టీఆర్ పడ్డ మానసిక క్షోభను ఈ చిత్రంలో చూపిస్తాం. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎన్నో సార్లు బోరున ఏడ్చారు. ఎన్టీఆర్ గారిని మోసం అనే విషం పూసిన కత్తితో వెన్ను పోటు పొడిచారు. ఎన్టీఆర్ వంటి మహామనిషి చావుకు కారణం అయిన ప్రతి ఒక్కరిని ఈ చిత్రం ద్వారా ప్రజా కోర్టులో నిలబెడుతా - ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారే న్యాయ నిర్ణేతలు. కట్టప్ప బాహుబలిని వెన్ను పోటు పొడిచాడు అది కల్పితం - కాని ఎన్టీఆర్ వెన్ను పోటు అనేది యదార్థం.
Full View