అక్షరాలు నేర్పడంలో వర్మ స్టైల్ అందాలు

Update: 2016-09-08 05:39 GMT
ఏదైనా ఓ విషయాన్ని ఎంత వరకూ వివాదం చేయచ్చు అంటే టాపిక్ ని బట్టి అనడం సహజం. కానీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర మాత్రం ఈ సబ్జెక్ట్ పై పెద్ద ఎన్ సైక్లోపీడియా ఉండి ఉంటుంది. లేదా తనే ఆ గ్రంథం అయినా కావచ్చు. టీచర్స్ డే రోజున మొదలైన 'టీచర్స్' వివాదాన్ని వర్మ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. తన స్టైల్ లో తనేదో చెబితే.. తనపై కేసులు పెట్టిన టీచర్లకు పంచ్ లు వేస్తూనే ఉన్నాడు వర్మ.

'ఫిలడెల్ఫియాలో టీచర్లు ఆల్ఫాబెట్స్ నేర్పించేందుకు చేసిన రీసెర్చ్ లో ఇదే ఉత్తమ మార్గం అని తేలింది' అంటూ ఓ అమ్మాయి వెనుతిరిగి ఉంటే అండర్ వేర్ పై అక్షరాలు ప్రింట్ చేసున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అంతే కాదు.. 'నాపై కేస్ పెట్టిన టీచర్స్ అందరూ ఇలా అక్షరాలు నేర్పించాలని తేల్చిన ఫిలడెల్ఫియా రీసెర్చ్ సెంటర్ పై కూడా కేసు పెట్టాలి' అని డిమాడ్ చేశాడు వర్మ. అరిజోనాలో అయితే.. విద్యార్ధులు తమను తాము నాశనం చేసుకున్న దాని కంటే.. టీచర్లు నాశనం చేసిందే ఎక్కువని సైంటిస్టులు చెప్పారన్నాడు.

ఎడ్యుకేషన్ పై ఇలాంటి ట్వీట్స్ పెట్టడం సరికాదంటూ ఓ ఫాలోయర్ ట్వీట్ చేసే సరికి. 'యా.. ఇక చాలు, నన్ను ఫాలో అవడం మానేసి.. టీచర్స్ ను ఫాలో అవచ్చు కదా' అంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి ఈ టీచర్స్ వివాదాన్ని వర్మ అంత తేలిగ్గా వదిలేట్లు కనిపించడం లేదు.
Tags:    

Similar News