సోషల్ మీడియా చురుగ్గా మారిన ఈ రోజుల్లో.. అందరి దృష్టిని ఆకర్షించటానికి చెత్తవాగుడు వాగేసి.. సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇష్టారాజ్యంగా మాట్లాడేసి.. తర్వాత వీర లెవెల్లో సారీ చెప్పేస్తూ.. అడ్డదిడ్డమైన వాదనకు ఒకసారి.. తర్వాత సారీ చెప్పటానికి మరోసారి వార్తల్లో నిలవటం ఈ మధ్యన ఫ్యాషన్ అయ్యింది. తాజాగా అలాంటి పనికి తెర తీశాడు సినీ విమర్శకుడన్న ట్యాగ్ లైన్ పెట్టుకున్న కమల్ ఆర్ ఖాన్. సౌత్..నార్త్ అంటూ తరచూ పోలికలు పెడుతూ.. దక్షిణాది నటుల మీదా.. సినిమాల మీదా తీవ్రమైన విమర్శలు.. అనుచిత వ్యాఖ్యలు చేయటం అతనికో అలవాటుగా చెబుతుంటారు.
తాజాగా బాహుబలి: ద కన్ క్లూజన్ ఓ చెత్త సినిమాగా వ్యాఖ్యానించిన ఈ క్రిటిక్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కాకుంటే.. తన రెగ్యులర్ ట్వీట్లకు భిన్నంగా..పేరును ప్రస్తావించకుండానే తిట్టిపోశాడు. బాహుబలి 2 సినిమా నచ్చని వారిని చూసి తాను జాలిపడుతున్నట్లుగా చెప్పిన ఆర్జీవీ.. అతను లేక ఆమెకు మానసిక చికిత్స అవసరమని.. చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ.. ఆ క్రిటిక్ మానసిక జబ్బుకు అవసరమైన వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును భరించాలని తాను మనవి చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.
బాహుబలి 2 తో తనకు కూడా జలసైటిస్ జబ్బు పట్టుకుందని.. ఆసుపత్రిలో చేరానని.. తన మాదిరి మరింతమంది చిత్ర నిర్మాతలు ఆసుపత్రిలో చేరినట్లుగా పేర్కొన్నారు. వారంతా కూడా చికిత్స పొందుతున్నట్లుగా చెప్పారు. బాహుబలి చిత్రనిర్మాత శోభు యార్లగడ్డ ఒక ట్వీట్ పెడుతూ.. అమెరికాలో బాహుబలి తుఫాను సృష్టిస్తోందని ట్వీట్ చేయగా.. దీనికి స్పందించిన వర్మ.. సార్ బాహుబలి 2ను కేవలం తుపానుగా చెప్పటం అవమానకరం.. ఇది అగ్నిపర్వతం బద్ధలై.. దాని కారణంగా వచ్చిన చిన్న చిన్న భూకంపాలతో పాటు వచ్చిన టైఫూన్ లాంటిదంటూ పేర్కొన్నారు. అదే సమయంలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్ ఐమాక్స్ ముందు సినిమా టికెట్ల కోసం అభిమానుల క్యూ వీడియోను పోస్ట్ చేశారు. థియేటర్ల ముందు ఈ తరహాలో సినిమా టికెట్ల కోసం క్యూలో నిలుచోవటం తనకు తెలిసి గుర్తు లేదని పేర్కొనటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/