ఈసారి నంది అవార్డుల అనౌన్స్ మెంట్ మీద వచ్చినన్ని విమర్శలు ఎప్పుడూ రాలేదు. మెగా ఫ్యామిలీ కావాలనే పక్కన పెట్టారంటూ మొదలైన విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా క్యాంపులోని బన్ని వాస్ - బండ్ల గణేష్ బహిరంగంగానే ఆవేదన బయటపెట్టారు. ఇక గుణశేఖర్ అయితే లెటర్లు రాయడంతోపాటు ప్రెస్ మీట్లు పెట్టి మరీ క్వశ్చన్స్ వేస్తున్నాడు.
తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగాడు. నంది అవార్డుల జారీపై ఓ డిఫరెంట్ స్టయిల్లో పంచ్ వేశాడు. అసలింత గొప్ప ఎంపిక ప్రపంచంలోనే ఉండబోదంటూ సెటైరిక్ గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘‘నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్’’ అంటూ తనదైన స్టయిల్లో కమిటీకి చురకలు పెట్టేశాడు.
ఆర్.జి.వి. ఇంతటితో ఏం సరిపెట్టలేదు. లెజెండ్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు కూడా తన పంచ్ పవర్ చూపించాడు. జెలసి ఉన్నవాళ్లు కావాలని లెజెండ్ సినిమాపై కాంట్రవర్సీలు సృష్టిస్తున్నారని తెగ ఫీలయిపోయాడు. ‘‘నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడని’’ సెటైర్ వేశాడు. అసలే నలువైపులా అవార్డులపై విమర్శలు వస్తున్న తరుణంలో ఆర్.జి.వి. తన పోస్టులతో దానిని మరికాస్త కెలికినట్లయింది.