అలా తీస్తే రంగా సినిమా పరిస్థితేంటి?

Update: 2016-04-04 22:30 GMT
బాబూ రామ్ గోపాల్‌ వర్మ.. ఏం చేస్తున్నావ్‌ నానా ఇప్పుడు? ఏముంది.. మన స్పోర్ట్స్ మినిస్ట్రీ వారికి క్లాసులు పీకుతున్నాడు. వెస్టిండీస్‌ బోర్డు దగ్గర నుండి మన బోర్డులు చాలా నేర్చుకోవాలని కితాబిస్తున్నాడు. మొన్న ఇండియో ఓడిపోయినప్పుడు.. వెస్టిండీస్‌ వారు 4 కోట్ల పాపులేషన్‌ నుండి 11 మంది నిష్ణాతులను తయారుచేస్తే.. ఇండియా మాత్రం 125 కోట్ల నుండి.. సరైన 11 మందిని తేలేకపోతోందని సెటైర్‌ వేశాడు.

బాగానే ఉంది సార్‌. అయితే ఇండియా హాలీవుడ్‌ తరహా ఫిలిం మేకర్లను తయారు చేయలేకపోతోంది అనే కామెంట్‌ చేస్తే మీరు తట్టుకోగలరా? అదంతా సరే.. ఇంతకీ ''ఎటాక్‌'' సినిమా ఏమైనట్లు? ఎట్లీస్ట్‌.. మంచు మనోజ్‌ కు సినిమాపట్ల జనాలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలనే ఐడియా అయినా వచ్చింది.. కాని రాము మాత్రం.. అసలు ఆ సినిమా గురించి మాట్లాడితే ఒట్టు. పైగా.. ఎటాక్‌ సినిమా చూశాక ఏ రేంజు తలనొప్పి వచ్చిందో తెలిస్తే.. అసలు మనోడు ''వంగవీటి'' సినిమా ఇంకెలా తీస్తాడో అనే సందేహం రాకమానదు.

ఎటాక్‌ మాదిరిగానే వంగవీటి కూడా కిచిడీ కిచిడీగా.. తలనొప్పి తలలో జేజెమ్మలా ఉంటే.. ఖచ్చితంగా అప్పుడు గొడవలు జరుగుతాయి. ఇవన్నీ తెలిసే రామ్‌ గోపాల్‌ వర్మ ఇదే నా ఆఖరి సినిమా అని డిక్లేర్‌ చేసినట్లున్నాడు. ఆఖరి సినిమా అయినా కాకపోయినా.. ఎటాక్‌ తరహాలో తీస్తే మాత్రం ఫ్యాన్సు హర్టవుతారు బాసూ. టేక్‌ కేర్‌.
Tags:    

Similar News