వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతి పెద్ద వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఇప్పటికే క్రిష్ - బాలకృష్ణలు ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే వర్మ ఎన్టీఆర్ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు - షూటింగ్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ చిత్రం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదల కాబోతున్న జనవరి 24న విడుదల చేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తిగా వివాదాస్పదంగా ఉంటుందని ముందే వర్మ చెప్పేశాడు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితంతో పాటు లక్ష్మీ పార్వతితో ప్రేమ - పెళ్లి ఎలా సాగిందనే విషయాలను ఈ చిత్రంలో వర్మ చూపించబోతున్నాడట. సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఎన్టీఆర్ గురించి వాస్తవాల్ని చూపిస్తానంటూ చెబుతూ వస్తున్న వర్మ ఆయన జీవితంలోని కీలక పరిణామం అయిన రెండవ పెళ్లిని చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఎంతో మంది అందగత్తెలు ఉండగా ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అని నేను చాలా సార్లు అనుకున్నాను. కాని ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు లక్ష్మీ పార్వతిపై ఉన్న ప్రేమను చెప్పాడు. అప్పుడే నాకు వారి ప్రేమ కథ అర్థం అయ్యింది. అందుకే పెళ్లికి ముందు - పెళ్లి తర్వాత లక్ష్మీ పార్వతి మరియు ఎన్టీఆర్ ల మద్య ప్రేమ కథను చూపించబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. రాజకీయ నేపథ్యంతో పాటు ఈ చిత్రంలో ప్రేమ కథను కూడా వర్మ చూపించబోతున్నాడన్నమాట.