వర్మ హాట్ ఎరోటిక్ మూవీ పోస్టర్

Update: 2016-02-08 09:12 GMT
సెన్సార్ బోర్డు మీద యుద్ధం చేసి చేసి అలసిపోయినట్లున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ రోజుల్లోనూ సెన్సార్ ఏంటి.. సెన్సార్ బోర్డును రద్దు చేసేయండి.. జనాలే ఏ సినిమా చూడాలో నిర్ణయించుకోనివ్వండి అంటూ ఆయన చేస్తున్న వాదనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక లాభం లేదని సెన్సారోళ్ల తలనొప్పి లేకుండా తన ఇష్టానుసారం సినిమా తీసి వదలడానికి ప్రిపేరైపోయాడు వర్మ. యూట్యూబ్ లో తనే సొంతంగా ‘ఆర్జీవీ టాకీస్’ పేరుతో ఓ ఛానెల్ ఓపెన్ చేసి.. అందులో మసాలా సినిమాలు వదలడానికి రెడీ అయ్యాడు. ముందుగా ‘సింగిల్ ఎక్స్’ పేరుతో ఓ ఎరోటిక్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు వర్మ.

కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా ఓ ఎరోటిక్ పోస్టర్ కూడా వదిలాడు వర్మ. ఓ అమ్మాయి బాత్రూంలో ఇన్నర్ వేర్‌తో కనిపిస్తున్న ఫొటో అది. అమ్మాయి ముఖం చూపించకుండా వెనుకనుంచి ఫొటో తీశారు. ఆ బ్యాక్ పోజుతోనే కుర్రాళ్లతో ఎంత వేడి పుట్టించాలో అంత వేడి పుట్టించేసిందా అమ్మాయి. ఆన్ లైన్ వీడియోలకు సెన్సార్ అంటూ ఏమీ ఉండదు. మరీ హద్దులు దాటిపోతే, ఎక్కువ కంప్లైంట్లు వస్తే తప్ప ఇబ్బంది లేదు. కాబట్టి వర్మ తన రసికత్వాన్ని ఎంత కావాలంటే అంత చూపించొచ్చన్నమాట.

ఈ ‘ఆర్జీవీ టాకీస్’కు సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే.. ఇందులో వర్మ తన సినిమాలతో పాటు వేరే వాళ్ల సినిమాలు కూడా రిలీజ్ చేస్తాడట. ఐతే అవి తన టేస్టుకు తగ్గట్లు ఎరోటిక్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలైతే బెటర్ అంటున్నాడు. దేవుడు, ఆధ్యాత్మికత టైపు సినిమాలతో మాత్రం తన దగ్గరికి రావొద్దంటున్నాడు. మరి ఇంకెందుకాలస్యం.. వర్మ టేస్టుకు తగ్గ సినిమా తీయండి. ఆయన పాపులారిటీని వాడుకుని బోలెడన్ని హిట్లు తెచ్చేసుకోండి.
Tags:    

Similar News