జనాలు లైట్ తీసుకున్నంత కాలం కొన్ని విషయాలు లైట్ గానే కనిపిస్తాయి. కానీ అవతలి వాళ్లు సీరియస్ అయ్యాక ఆ విషయాల్లో తీవ్రత ఏంటన్నది అర్థమవుతుంది. రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్లో తాను చేసే వ్యాఖ్యల తీవ్రత ఎలాంటిది.. వాటి ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు బాగానే అర్థమవుతూ ఉంటుంది. రెండేళ్ల కిందట ఒకానొక వినాయక చవితిని పురస్కరించుకుని అయ్యవారు గణనాథుడి గురించి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించాడు. తన శరీర భాగాలే సరిగా లేని వాడు.. తన ప్రాణాలే కాపాడుకోలేని వాడు.. జనాల ప్రాణాల్ని ఏం కాపాడతాడు అంటూ లాజిక్ తీశాడు వర్మ. ఆయన మాటల్లో లాజిక్ సంగతలా ఉంచితే.. ఈ వ్యాఖ్యలు చాలామంది మనోభావాల్ని దెబ్బ తీశాయి.
ఐతే చాలామంది వర్మ ఇంతే కదా అని వదిలేశారు కానీ.. ఇండస్ కమ్యూనికేషన్స్ అనే సంస్థ ఎండీ వివేక్ శెట్టి మాత్రం ఊరుకోలేదు. వర్మ వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేశాడు. కోర్టు ఆ కేసును విచారణకు స్వీకరించింది. ఆ కేసు విషయమై ఇప్పటికే సమన్లు కూడా అందుకున్నాడు వర్మ. తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పినా.. వేరే వివాదాల కారణంగా ట్విట్టర్ కూడా వదిలేసి వెళ్లిపోయినా.. ఈ కేసు మాత్రం ఆయన్ని వదలట్లేదు. తాజాగా వర్మకు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఆగస్టు 8 లోపు కేసు విచారణ కోసం కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరి వర్మకు కోర్టుకు వెళ్తాడా.. తన వాదన ఏమని వినిపిస్తాడు.. ఈ కేసు నుంచి ఎలా విముక్తడవుతాడో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/