పుట్టిన రోజు నాడు వర్మ చావు మాటలు

Update: 2015-04-07 07:30 GMT
పుట్టిన రోజున ఎవరైనా చావు గురించి మాట్లాడుతారా? ఆ మాట ఎత్తగానే అపశకునం.. అపశకునం.. అని నోరు మూసేస్తారు. కానీ వర్మ స్టయిలే వేరు కదా. అందుకే ఈ రోజు ఆయన బర్త్‌డే అయినప్పటికీ దాని గురించి కాకుండా డెత్‌ డే గురించి మాట్లాడుతున్నాడు. దీని మీద సాక్షి టీవీలో చేసే ఓ స్పెషల్‌ ప్రోగ్రామ్‌లోనూ పాల్గొనబోతున్నాడు. నా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సాక్షి టీవీలో డెత్‌డే గురించి మాట్లాడబోతున్నా.. చూసి అనందించండంటూ తనదైన స్టయిల్లో ఓ ట్వీట్‌ కూడా పెట్టాడు వర్మ.

ఇక తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి సమయం వృథా చేసుకోవద్దని కూడా వర్మ చెప్పాడు. ''నేను ఎప్పుడో చనిపోయాను. నేను చేసిన పాపాల ప్రకారం చూస్తే నాకు కచ్చితంగా పునర్జన్మ కూడా ఉండదు. కాబట్టి నాకు 'మెనీ మెనీ రిటర్న్స్‌' అంటూ శుభాకాంక్షలు చెప్పి సమయం వృథా చేసుకోవద్దు'' అన్నాడు వర్మ. అంతటితో ఆగకుండా.. పుట్టిన రోజుకు, చచ్చే రోజుకు తేడా గురించి కూడా వేదాంతం వల్లించాడు. ''పుట్టినరోజు ఇంకా బతికే ఉన్నాను కాబట్టి అక్కడక్కడా కొంచెం కొంచెం పొగుడుతున్నారు. చచ్చిన రోజు మాత్రం పూర్తిగా పొగుడుతారు'' అని ట్వీట్‌ చేశాడు వర్మ. ఎంతైనా ఆర్జీవీ ఆర్జీవీనే కదా.

Tags:    

Similar News