సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారెవరు? కచ్ఛితంగా సినీ అభిమానులు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు.. క్రేజీ మూవీస్ అయితే సినీప్రేక్షకులతో పాటు సామాన్యుల్లోనూ ఆసక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. కానీ.. ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు సైతం ఉత్కంటగా ఎదురుచూసే పరిస్థితి పెద్దగా ఉండదు.
ఇందుకు భిన్నంగా తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో తెరకెక్కుతున్న మూవీలపై ఆసక్తి వ్యక్తమవుతోంది. బాలయ్య నటిస్తున్న రెండు భాగాలు ఒక ఎత్తు అయితే.. రాంగోపాల్ వర్మ తీస్తున్న మరో సినిమాతో ఇప్పుడు అందరి చూపులు ఈ వీటి మీద పడ్డాయి. ఇంతకీ బాలయ్య సినిమాలో ఏముంటుంది? వర్మ సినిమాలో ఏముంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సినిమా.. రాజకీయ జీవితంతో పాటు ఇందిర కారణంగా ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావటం.. ఆ తర్వాత వెల్లువలా విరుచుకుపడిన ప్రజాగ్రహంతో ఉక్కుమహిళ ఒక అడుగు వెనక్కి వేసి ఎన్టీఆర్ ను సీఎం సీటులో కూర్చోబెట్టటం వరకూ ఉంటుందని చెబుతున్నారు.
బాలయ్య సినిమా ఎక్కడితో ఆగుతుందో.. అక్కడి నుంచే వర్మ మూవీ మొదలవుతుందట. 85-89 మధ్య కాలంలో ఎన్టీఆర్ పాలన.. వివాదాస్పద నిర్ణయాలు.. 89లో ఓటమి.. తర్వాత సొంత కుటుంబం నుంచి ఎదుర్కొన్న నిరాదరణ.. ఆనారోగ్యం.. రాజకీయ అవమానాలు.. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించటం.. ఆమెతో పెళ్లి.. 1994లో కాంగ్రెస్ ను మట్టి కరిపించిన వైనాలు అన్ని ఉంటాయట. అల్లుడు చంద్రబాబు అంచనాలకు భిన్నంగా ఎన్టీఆర్ ఎన్నికల్లో విజయం సాధించిన తీరుతో పాటు.. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు వెన్నుపోటు.. ఆ తర్వాతి పరిణామాలు.. ఎన్టీఆర్ మరణం వర్మ మూవీలో ఉంటుందని చెబుతున్నారు.
అందరికి తెలిసిన విషయాల్ని తీసుకొని బాలయ్య మూవీ సినిమా తీయటం ఆసక్తికరమే అయినా.. సంచలన అంశం.. తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రకు కీలకమైన అంశాన్నిపాయింట్ గా తీసుకొని తెరకెక్కించే వర్మ మూవీనే ఆకట్టుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ అంచనాల్ని పక్కన పెడితే.. ఒక్క విషయం మాత్రం వాస్తవం. ఎవరైతే నిజాన్ని నిర్బయంగా చెప్పగలుగుతారో.. వారి సినిమానే ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పక తప్పదు.