తనదైన శైలిలోవ్యాఖ్యలు చేసే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ టచ్ చేయాని సబ్జెక్ట్ అంటూ ఏదీ ఉండదు. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభ నేపథ్యంలో ఇప్పటికే ఒకట్రెండు సార్లు ట్వీట్లు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. తాజాగా అమ్మ ఆత్మ.. చిన్నమ్మ శశికళ.. పన్నీర్ సెల్వంలపై తన అభిప్రాయాల్ని.. తనకున్న సందేహాల్ని ట్వీట్ల రూపంలో బయటపెట్టారు.
మరి.. అవి ఎలా ఉన్నాయో చూస్తే..
= ప్రస్తుత పరిస్థితుల్లో జయలలిత ఆత్మ ఏం ఆలోచిస్తూ ఉంటుందన్నది తనకు చాలా ఆసక్తిగా ఉంది. మరి.. జయ ఆత్మ చివరగా ఆశీర్వదించేది పన్నీర్ సెల్వంనా.. శశికళనా? అన్నది ప్రశ్నగా ఉంది.
= గతంలో శశికళ కాళ్లకు పన్నీర్ సెల్వం ఎంతలా మొక్కి ఉంటాడో అంతలా శశికళ షాక్ కు గురి చేస్తున్నారు.
= గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ప్రవర్తించిన విషయాల్నిశశికళ గుర్తు చేసుకొని ఆశ్చర్యపడుతూ ఉండొచ్చు. కానీ.. అంతకు ముందు శశికళ తానే ఒక బానిసలా ప్రవర్తించిన విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. పాత రోమన్ సామెత గుర్తుకు వస్తోంది. ‘‘యూ టూ బ్రూటస్ (అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు నమ్మక ద్రోహం చేసిన సమయంలో వాడతారు) అన్నట్లు ప్రస్తుతం ఉంది.