చిరంజీవి గారి 60తో నేను హర్టయ్యాను

Update: 2015-08-22 04:05 GMT
ఏనాడు పాజిటివ్‌గా ఏదైనా చెప్పవ్‌ గనుకు.. ఈసారి ఏదైనా పాజిటివ్‌ గా చెప్పడానికి.. కాని ఇప్పుడు మాత్రం మనోడు ఒక రేంజులో తన వేదన, ఆవేదన, ఆత్మఘోష చెప్పుకున్నాడు. అయితే ఇదంతా పిచ్చ పాజిటివ్‌ గా చెప్పేశాడు దర్శక దిగ్గజం రామ్‌ గోపాల్‌ వర్మ. కాని ఈసారి మనోడు బర్తడే విషెస్‌ చెప్పాడండోయ్‌.

''చిరంజీవి గారూ.. నేను ఎవరికీ ఎప్పుడూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపను. కాని మీ పుట్టుక మా జన్మలకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది. సో, మీ జన్మదినం సందర్భంగా మాకు ఈ జన్మ వచ్చినందుకుగాను మాకు మేమే శుభాకాంక్షలు చెప్పకుంటున్నాం''.. అంటున్నాడు వర్మ. మాకూ మాకూ అంటూ మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్‌ చేయకండి గురూజీ.. ఇకపోతే చిరంజీవిని కలకలాం 26 ఏళ్ళ వయస్సులో చూడాలని అనుకుంటే, ఆయన మాత్రం ఇలా 60 ఏళ్ళు వచ్చాయని తనకు తానే ప్రకటించుకొని నాలాంటి సన్సియర్‌ అభిమానిని హర్టు చేశారు అంటూ ఫీలయ్యాడు 'రక్త చరిత్ర' సృష్టికర్త.
 
''మీ చుట్టూ  ఉన్న వారందరూ మీకు 60 వచ్చిందని ఎంతగా ఎడ్వరటైజ్‌ చేస్తున్నా సరే.. మీరు మాత్రం మాకు ఎప్పటికీ 26 ఏళ్ళ చిరంజీవే'' అంటూ ముగించాడు. ఇక ఆయన కుటుంబ సభ్యులే మీరు రిటైర్‌ అయిపోండి అన్నట్లు ఈ షష్టిపూర్తి చేస్తున్నారని మనోడు కామెంట్ విసరడం ఓ పెద్ద షాకే.
Tags:    

Similar News