ఆర్జీవీకి ఆ ఎడిటర్ ని పెళ్ళి చేసుకోవాలనే కోరిక కలిగిందట..!

Update: 2020-04-23 09:37 GMT
వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా అనేది ఈయన వాడకానికే పుట్టిందా అనే రేంజ్ లో వాడుతుంటారు. వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సమాజంలో జరిగే అనేక విషయాల మీద ఫోకస్‌ పెట్టి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటాడు ఆర్జీవీ. ప్రస్తుతం క‌రోనా వైర‌స్ దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో క‌రోనాపై వ‌రుస ట్వీట్లు చేస్తూ వార్త‌ల్లో ఉంటూ వస్తున్నాడు వ‌ర్మ. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ట్వీట్లతో నెటిజ‌న్స్‌ ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే వున్నారు. లాక్‌ డౌన్ విధించ‌డంతో మందు దొర‌క్క‌పోవ‌డంతో మందు బాబులు చిత్ర విచిత్రం గా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని.. వారిని ఆదుకోవ‌డం కోసం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం పెద్ద మ‌న‌సుతో ఇంటింటికీ  మ‌ద్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని - అదే త‌ర‌హాలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని ట్వీట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటనపై వర్మ పలు సరదా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఆర్జీవీ మరోసారి ట్రంప్‌ పై ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ట్రంప్‌ - మోదీ మధ్య స్నేహాన్ని ఉద్దేశిస్తూ వర్మ ఫన్నీ ట్వీట్‌ చేశారు. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘దీన్ని ఎడిట్‌ చేసిన ఎడిటర్‌ ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ ట్విటర్‌ లో పేర్కొన్నాడు. 'దళపతి' సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట..’ పాట తమిళ వర్షన్‌ లో మోదీ - ట్రంప్‌ ఒకరికొకరు పోటీ పడుతూ పాట పాడుతున్నట్లు ఎడిట్‌ చేశారు. దీనికి ముగ్ధుడైన వ‌ర్మ ఈ ఎడిట‌ర్‌ ని పెళ్లి చేసుకోవాల‌ని వుంద‌ని ట్వీట్ చేశాడు. గతంలో కూడా ట్రంప్‌ - మోదీ మధ్య స్నేహ బంధానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు వర్మపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ట్వీట్ చూసిన వారంతా వ‌ర్మ చిలిపి కోరిక ఫ‌లిస్తుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించటంతో పాటు ఫన్నీ ట్వీట్స్‌తో నెటిజెన్లను అలరిస్తున్నాడు ఆర్జీవి. అంతేకాదు కరోనాపై పాట రాసి పాడిన వర్మ తాజాగా కరోనా పై ఓ సినిమాను కూడా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News