హిట్ల మీద ఉన్నప్పుడు ఆ ఊపు వేరేగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఆకాశాన్ని తాకుతుంది. అదే రెండు ఫ్లాపులు తగిలితే టాలెంట్.. కంటెంట్ లాంటి పదాలేవీ కాన్ఫిడెన్స్ ను తీసుకురాలేవు. అప్పుడు మనమీద మనకు అనుమానం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉందట.
దిల్ రాజు ప్రొడక్షన్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో దాదాపుగా అన్నీ విజయం సాధించాయి. ఒకరకంగా చెప్తే అది నిర్మాతగా పెద్ద రికార్డు. కానీ 2018 లో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఎందుకంటే రాజుగారి బ్యానర్ నుండి రిలీజ్ అయిన మొదటి సినిమా 'లవర్' బోల్తా కొట్టింది. ఇప్పుడు ఎంతో గొప్పగా ప్రమోట్ చేసిన 'శ్రీనివాస కళ్యాణం' పరిస్థితి రోజు రోజుకీ తీసికట్టులా ఉంది. దీంతో రాజుగారి బ్యానర్ నుండి రానున్న 'హలో గురూ ప్రేమ కోసమే' టీమ్ ఇప్పుడు టెన్షన్ లో పడిందట... ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడడంతో వాళ్ళు కిందామీదా అయిపోతున్నారట.
దానికి తోడు ఒక్క దర్శకుడు త్రినాధ రావు నక్కిన తప్ప టీమ్ లో అందరూ ఫ్లాపుల్లో ఉండడం వారిని కలవరపెడుతోంది. హీరో రామ్ 'హైపర్'.. 'ఉన్నది ఒక్కటే జిందగీ' ఫ్లాపుల షాక్ లో ఉన్నాడు. హీరోయిన్ అనుపమ 'ఉన్నది ఒక్కటే జిందగీ'.. 'కృష్ణార్జున యుద్ధం'.. 'తేజ్ ఐ లవ్ యూ' ఇచ్చిన జర్క్ నుండి ఇంకా బయటకు రాలేదు. ఇప్పడు రాజుగారికేమో 'లవర్'.. 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలు ఝలక్ ఇచ్చాయి. అందరీలో నక్కిన ఒక్కడే పాజిటివ్ సెంటిమెంట్ అంటున్నారు. కాబట్టి నక్కిన మిగతా వాళ్ళను తన హిట్ ట్రాక్ లో కి తీసుకొస్తాడా లేదంటే వాళ్ళ ఫ్లాప్ ట్రాక్ లోకి తను కూడా వెళ్తాడా అనేది మనకు అక్టోబర్ 18 న తెలుస్తుంది. ఎందుకంటే.. ఆ రోజున 'హలో గురూ..' ప్రేక్షకులకు థియేటర్లలో హలో చెప్తుంది కాబట్టి.