చైతు ఐడియాని వాడేస్తున్న రామ్

Update: 2016-09-29 09:30 GMT
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హైపర్.. రొమాంటిక్ సినిమాల స్పెషలిస్ట్ గా మారిపోయిన అక్కినేని నాగచైతన్య ప్రేమమ్.. వారం గ్యాప్ లో థియేటర్లలోకి వస్తున్నాయి. ఎప్పుడో చెప్పినట్లుగానే సెప్టెంబర్ 30న హైపర్ వస్తుండగా.. పలు వాయిదాల తర్వాత దసరా సెలవల మధ్యలో డేట్ సెట్ చేసుకున్నాడు చైతు. వారం గ్యాప్ లో వస్తున్న ఈ మీడియం బడ్జెట్ సినిమాలకు.. కాపీ అవసరం పెద్దగా లేదు కానీ.. ఓ విషయంలో మాత్రం ఇమిటేషన్ కనిపిస్తోంది.

ప్రేమమ్ ట్రైలర్ ను నిమిషం 43 సెకన్ల డ్యురేషన్ తో కట్ చేసి.. 1..4..3.. అంకెలు టచ్ అయ్యేలా చేశారు. 143 అంటే ఏంటో అర్ధం చెప్పాల్సిన పని లేదు కాబట్టి.. నెక్ట్స్ రామ్ విషయానికొచ్చేస్తే.. ఇప్పుడు హైపర్ మూవీ డ్యురేషన్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ మూవీ ఫైనల్ కట్ 143 నిమిషాలకు సెట్ చేశారట. అంటే.. 2 గంటల 23 నిమిషాల పాటు అలరించనున్నాడు ఎనర్జిటిక్ హీరో. నిజానికి ప్రేమమ్ ఒక లవ్ స్టోరీ కాగా.. హైపర్ తండ్రీ కొడుకుల సెంటిమెంట్ పై బేస్ అయిన సినిమా కాబట్టి.. పోలిక ఈ అంకెల దగ్గరే ఆగిపోయే ఛాన్స్ ఉంది.

రాశిఖన్నాతో రామ్ ఎలాంటి సందడి చేశాడో తెల్లారితే తెలిసిపోనుంది. కందిరీగ తర్వాత రామ్-సంతోష్ శ్రీనివాస్ లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో.. ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News