వీర‌య్య‌...బాల‌య్య! ఎవ‌రు బెస్ట్ ఫైట‌ర్? రామ్ -ల‌క్ష్మ‌ణ్

Update: 2023-01-01 05:35 GMT
సంక్రాంతి కానుక‌గా యుద్దానికి సిద్ద‌మైన `వాల్తేరు వీర‌య్య‌`...`వీర‌సింహారెడ్డి` నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌ల‌వ్వ‌డంతో!  ఆ గ‌డియ‌లు ఎప్పుడొస్తాయా? అని అభిమానులు ఎంతో  ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూ స్తున్నారు. పోటీగా మ‌రో రెండు సినిమాలు బ‌రిలోఉన్నా చిరంజీవి..బాల‌య్య ల మ‌ధ్య వార్ ఎప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌త్యేక‌మే.

మ‌రి బాక్సాఫీస్ యుద్దం కంటే? ఆన్ సెట్స్లో ఎవ‌రెవ‌రు ఎలా త‌ల‌ప‌డ్డారో?  తెలియాలంటే స్టంట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్  స్పందించాల్సిందే. ఈ రెండు సినిమాలకు  వీళ్లిద్ద‌రే  ఫైట్స్ కంపోజ్ చేసారు. తాజాగా ఆ రెండు సినిమాల అనుభ‌వాల్ని పంచుకున్నారు. ఆవెంటో వాళ్ల మాట‌ల్లోనే...

``రెండు సినిమాలు వేటిక‌వి ప్ర‌త్యేకంగా ఉంటాయి. అందుకే మాకు ఈ సినిమాలు రెండు స‌వాల్ గానే అనిపించాయి. ఫైట్ల విష‌యంలో వైవిథ్య‌త వీలైనంత వ‌ర‌కూ చూపించాం. రెండు ఒకే జోన‌ర్ క‌థ‌లైతే ఇబ్బంది ప‌డేవాళ్లం. `వాల్తేరు వీర‌య్య` లో ఇంట‌ర్వెల్ ఫైట్ ఆక‌ట్టుకుంటుంది. `ముఠా మేస్ర్తి`లా లుంగీ కట్టుకుని శ్రీకాకుళం యాస‌లో మాట్లాడుతూ అంద‌రితో క‌లిసిపోయే మాస్ మ‌నిషి వీర‌య్య‌.. అలాంటి వ్య‌క్తి ఇంట‌ర్వెల్ కి ముందు రెండు తుపాకులు చేత ప‌ట్టి ప్ర‌తి నాయ‌కుల‌పై విర‌చుకుప‌డ‌తాడు.
ఈ ఫైట్ కోసం 16 రోజులు క‌ష్ట‌ప‌డ్డాం.  చిరు-శ్రుతి పైనా ఓ స‌ర‌దా ఫైట్ ఉంటుంది. ఇక  `వీర‌సింహారెడ్డి`లో  బాల‌య్య కుర్చీలో కుర్చిని విల‌న్లు కొట్ట‌డం మామూలుగా ఉండ‌దు.  టర్కీల్ చేసిన యాక్ష‌న్ ఇంట‌ర్వెల్ సీన్ అదిరిపోతుంది.  ఫైట‌ర్లుగా చిరంజీవి...బాల‌య్య వేర్వేరు. ఇద్ద‌రికీ  ఎవ‌రి స్టైల్లో వారికి ప్ర‌త్యేక‌త ఉంది. పండ‌క్కి రెండు సినిమాలు ఓ పీస్ట్ లాం ఉటాంయి అని గ‌ట్టిగా చెప్ప‌గ‌లం.

మేము కూడా  ఇద్ద‌రం కాబ‌ట్టి ప్ర‌తీ ఫైట్ కి రెండు ఆలోచ‌న‌లుంటాయి.  వాటిని ద‌ర్శ‌కుడికి చెబుతాం. వాటిలో ఒక‌టి ఫైన‌ల్ అవుతుంది. ఇద్ద‌రం కామ‌న్ గా న‌మ్మేది ఒక్క‌టే. ప్ర‌తీ ఫైట్కి ఓ  కాన్సెప్ట్ ఉండాలి.  అలా లేక‌పోతే ఆ ఫైట్ కి ప‌రిపూర్ణ‌త ఉండ‌దు. అలా లేక‌పోతే చూసే వాళ్ల‌కి బోర్ కొడుతుంది. అది మాకు బోరింగ్ అంశంమే. అందుకే ప్ర‌తీ ఫైట్ లోనూ కొత్త‌ద‌నం ఉండేలా చూసుకుంటాం.` అని అన్నారు.
Tags:    

Similar News