రామ్‌.. ఆ డైలాగ్‌ బాగుంది కానీ..

Update: 2016-01-02 04:58 GMT
యంగ్ హీరో  రామ్‌ 'నేను శైలజ' సినిమాతో దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత మనోడు తొలిరోజు షో కు ఫ్లాప్‌ టాక్‌ వినకుండా.. ఎబోవ్‌ యావరేజ్‌.. బాగుంది.. నచ్చింది.. ఫీల్‌ గుడ్‌ వంటి మాటలు విన్నాడు. దానితో కుర్రాడు గాలిలో తేలిపోతున్నాడు.

అయితే ఈ యంగ్‌ ఎనర్జటిక్‌ స్టార్‌ నేను శైలజ సినిమా క్లయ్‌ మ్యాక్స్‌ లో ఒక పొడువాటి డైలాగ్‌ చెప్పాడు. ఒక నిమిషం పైనే ఉన్న డైలాగ్‌ ను సింగిల్‌ టేక్‌ లో పూర్తి చేశాడు. కాని ఇదే వర్షెన్‌ లో డైలాగ్‌ తొలిసారిగా చెప్పింది.. ఈ మధ్యకాలంలో హీరో ధనుష్‌ అనే చెప్పాలి. గత ఏడాది ధనుష్‌ తీసిన ''విఐపి'' సినిమాలో ఈ డైలాగ్‌ ఉంది. వింత ఏంటంటే.. ఆ తమిళ సినిమాను తెలుగులో రామ్‌ తో తీయాలనుకుని.. అతడికి కథ నచ్చకపోవడంతో అంకుల్‌ స్రవంతి రవికిషోర్‌ దానిని డబ్‌ చేసి 'రఘువరన్‌ బి.టెక్‌' అంటూ రిలీజ్‌ చేశారు. ఆ సినిమాలో విలన్‌ తో ధనుష్‌ చెప్పే ఆ నాన్‌ స్టాప్‌ డైలాగ్‌ హైలైట్‌. అక్కడ మనోడు కష్టపడి చదువుకుని పైకొచ్చిన వారి ఉద్యోగ అవకాశాలను.. డబ్బున్నోళ్లు ఎలా కొట్టేస్తున్నారో చెబితే.. ఇక్కడ రామ్‌ బాబు లవర్ల గురంచి లెక్చర్‌ ఇచ్చాడు.

సర్లేండి.. ఆ డబ్బింగ్‌ సినిమా డైలాగ్‌ ఎవరికి గుర్తుంటుంది అనుకుంటారేమో.. 'నేను శైలజ' సినిమాలోనే ఒక సీన్ లో దగ్గరుండి మరీ 'రఘువరన్‌ బిటెక్‌' సీన్‌ వేసి చూపించాడు. ఆ సీన్‌ చూశాక.. క్లయ్‌ మ్యాక్స్‌ లో ఈ డైలాగ్‌ వినగానే.. హేయ్‌ ఈ డైలాగ్‌ కు ఇన్సిపిరేషన్‌ అదే కదూ అంటూ ఎవరికైనా స్ర్టయిక్‌ అయిపోతుందిలే.
Tags:    

Similar News