రాముడూ.. ఏందీ అవతారం??

Update: 2017-07-28 06:08 GMT
మన హీరోలు కూడా సినిమా సినిమాకూ అవతారం మార్చాలని ఈ మధ్యనే బాగానే కష్టపడుతున్నారు. కొందరు సీనియర్ హీరోలు ఒకటే లుక్కుతో ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా.. జూనియర్లు మాత్రం రకరకాలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదిగో ఇప్పుడు డైనమిక్ హీరోగా పేరొందిన సీతారామ్ పోతినేని ఎలియాస్ రామ్ కూడా అలాంటి ప్రయోగాలే చేస్తున్నాడు.

ఆ మధ్యన గెడ్డాన్ని ఇష్టం వచ్చినట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన రామ్.. ఇప్పుడు తన హెయిర్ స్టయిల్ మరియు బియర్డ్ ఒక తరహాలో మార్చేశాడు. గత రాత్రి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కూతురు వివాహంలో అంకుల్ స్రవంతి రవి కిషోర్ తో కలసి సందడి చేసిన రామ్.. అక్కడ తన లుక్స్ తో అందరినీ ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి. పైరేట్ తరహాలో గెడ్డం.. లాంగ్ హెయిర్.. చాలా ట్రెండీగా ఉన్నాయి. కరుణాకరన్ డైరక్షన్లో సినిమాను మొదలెట్టి ఆపేసిన రామ్.. ఇప్పుడు కిషోర్ తిరుమల డైరక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసమే ఈ స్టయిలింగ్ ఫాలో అవుతున్నట్లున్నాడు.

ఇకపోతే రామ్ ఈ అవతారంలో చాలా కొత్తగా అర్బన్ స్టయిల్లో ఉండేసరికి.. మరి కిషోర్ తిరుమల గతంలో తీస్తున్నట్లు మిడిల్ క్లాస్ కథను టచ్చేసినట్లు అనిపించట్లేదు. ఇంతటి పోష్‌ రోల్ అంటే.. మరి రామ్ కు అది ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి. ఈ మధ్య కాలంలో నేను శైలజ తరువాత హైపర్ అంటూ ఊరమాస్ సినిమా ఒకటి చేసేసి పెద్ద పంచే తిన్నాడు రామ్. అందుకే ఇప్పుడు ఇలా జాగ్రత్తగా సైలెంటుగా అన్నీ కొత్తగా ప్రయత్నిస్తోంది. అది సంగతి.
Tags:    

Similar News