బడ్జెట్ వల్లే అలా... ఫ్యూచర్ లో చేస్తా!

Update: 2018-10-17 07:32 GMT
హీరో రామ్ కెరీర్లో సూపర్ హిట్స్ తో పాటుగా ఫ్లాపులు కూడా ఉన్నాయి.  ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ సినిమాను ఫైనలైజ్ చేసుకునే విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటాడనే టాక్ ఉంది. 'గరుడవేగ' హిట్ తర్వాత రామ్ - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కవలసి ఉన్నప్పటికీ అది సైడ్ లైన్ అయింది.  

రామ్ మార్కెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్ ను ప్రవీణ్ సత్తారు అడిగాడని.. ప్రాజెక్టు వయబుల్ కాదని పక్కనబెట్టారని ఆ సమయంలో రూమర్లు వినిపించాయి.  మొదట  భవ్య క్రియేషన్స్ వారు నిర్మించేందుకు ముందుకు వచ్చి లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యారు.  తర్వాత రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తారని వార్తలు వచ్చాయి గానీ అంత బడ్జెట్ వర్క్ అవుట్ కాదని అయన కూడా వద్దని చెప్పారట.  ఫైనల్ గా భవ్య - స్రవంతి వారు కలిసి జాయింట్ గా నిర్మిస్తారని కూడా అన్నారు.. కానీ అది కూడా జరగలేదు.   కానీ ఇంతవరకూ ఏం జరిగిందనేది మాత్రం ఎవ్వరూ కన్ఫర్మ్ చేయలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రామ్  ను ప్రవీణ్ సత్తారు సినిమా గురించి అడిగితే "ప్రవీణ్ సత్తారు తో ఒక మూవీ అనుకున్నాం.  కానీ అది ఆగిపోయింది.  ఆ సినిమా ఆగిపోవడానికి మెయిన్ రీజన్ బడ్జెట్టే.   బడ్జెట్ ఎక్కువ కావడంతోనే ఆ సినిమా  ఆగిపోయింది. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేస్తాను" అన్నాడు.
Tags:    

Similar News