ఉస్తాద్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఎన్. లింగుసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ని శనివారం మేకర్స్ రిలీజ్ చేశాడు. ఆదివారం హీరో రామ్ పుట్టిన రోజు కావడంతో ఒక రోజు ముందుగానే టీజర్ ని విడుదల చేయడం విశేషం.
ఈ చిత్రంతో హీరో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ గా నటించారు. ఇదిలా వుంటే 'శనివారం విడుదలైన ది వారియర్ టీజర్ లో ఉస్తాద్ రామ్ దుమ్ము దులిపేశాడు. తనదైన మార్కు మాసీవ్ డైలాగ్ లతో ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యగా ఈ చిత్రంలో రామ్ పాత్రని దర్శకుడు లింగుసామి మలిచిన తీరు ఆకట్టుకుంటోంది.
'ఈ పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నాం అప్పా! ఇంతకు ముందు సైలెంట్ గా వుండేటోళ్లు.. ఇప్పడు వైలెంట్ గా లోపలేస్తాండారు. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చున్నాడు. వాడియమ్మా.. ఒక్కొక్కడికి పెడుతున్నాడు.. కానీ ఒకటప్పా కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు..అంటూ ఓ కమెడియన్ వాయిస్ తో టీజర్ మొదలైంది.
రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. పాన్ ఇండియా సినిమాలు చూసుంటారు.. పాన్ ఇండియా రౌడీస్ ను చూశారా? .. మైడియర్ గ్యాంగస్టర్స్ వీలైతే మారండీ లేకపోతే పారిపోండీ..ఇదే నును మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ ' అంటూ రామ్ చెబుతున్న డైలాగ్ లు.. ఆట బానే వుంది ఆడేద్దాం... అంటూ ఆది పినిశెట్టి ఊర మాసీవ్ పాత్రలో చెబుతున్న డైలాగ్ లు సినిమా ఓ రేంజ్ లో రచ్చ చేసేలా వుందనే సంకేతాల్ని అందిస్తోంది. అంతే కాకుండా ఆది పినిశెట్టి గెటప్ కూడా చాలా కొత్తగా వుంది.
మధ్యలో కృతిశెట్టి - రామ్ ల రొమాన్స్.. తల్లి పాత్రలో 'ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చిన వాళ్లని కొట్టడం కాదు వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం' అని నదియా రామ్ తో చెబుతున్న సంభాషణలు.. టీజర్ లో మాస్ ఎలిమెంటే కాకుండా ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వున్నాయని స్పష్టం చేసింది. చాలా రోజుల తరువాత రామ్ నుంచి వస్తున్న మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ కనిపిస్తోంది.
రెడ్ మూవీ తరువాత రామ్, వరుస ఫ్లాపుల తరువాత ఎన్. లింగుసామి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తూ కసితో ఈ సినిమా చేశారు. జూలై 14న అత్యంత భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ వారి నమ్మకాన్ని నిలబెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని అందిస్తుందా? అన్నది తెలియాలంటే జూలై 14 వరకు వేచి చూడాల్సిందే.
Full View