తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు కాని.. కుర్ర హీరో రామ్ మాత్రం.. ఒక ఘాటైన కామెంట్ చేశాడు. మనోడు ఇప్పుడు స్టార్డమ్ గురించి ప్రశ్నిస్తే అబ్బే నాకు లాబీయింగ్ పెద్దగా అలవాటు లేదని చెప్పాడు. ప్చ్.. ఇదెక్కడి కామెంటండీ బాబూ.
ఇప్పటివరకు మీరు చాలామంది స్టార్ హీరోల తరుపులో ఎంతో కష్టపడ్డారా.. బహుశా మీ కష్టానికి తగిన గుర్తింపు రాలేదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఆ రేంజ్ స్టార్డమ్ ఇంకా రాలేదని ఫీలయ్యారా? అంటూ ఒక ప్రశ్నను సంధించారు తెలుగు మీడియా వారు. దీనిపై మాట్లాడిన రామ్.. ''అబ్బే నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. అసలు నేను పలానా స్టాటస్ కావాలనో.. పలానా రోల్ కావాలనో.. లేకపోతే ఎప్పుడూ వార్తలో ఉండాలనో లాబియింగ్ చెయ్యను. నాకంటూ ఒక దారి క్రియేట్ చేసుకుని అందులోనే వెళుతున్నా. గుర్తింపు అనేది వచ్చినప్పటికే వస్తుంది'' అంటూ సెలవిచ్చాడు. ఈ కామెంట్ ఏదో కాస్త తేడాగా లేదూ? అంటే స్టార్డమ్ వచ్చినవారందరూ లాబీయింగులూ చేస్తున్నట్లేనా?
మొత్తానికి చాలాసార్లు ఇతర స్టార్లపై సెటైర్లు వేసిన రామ్.. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ చేశాడులో. ఇకపోతే ఈ సినిమాక్కూడా ఎక్కడైనా నెగెటివ్ రివ్యూలు వస్తే ట్విట్టర్లో మళ్లీ ఏకేస్తాడేమో. లేకపోతే లాబీయింగ్ చేయను అంటాడేమో.