తమిళంలో 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'బోగన్'. జయం రవి, అరవింద స్వామి, హన్సిక నటించిన ఆ సినిమాను తెలుగులో రవితేజ రీమేక్ చేయాలని ఆశ పడ్డాడు. ఆ సినిమాను రామ్ తాళ్లూరి రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించాడు. షూటింగ్ మొదలు అవ్వనుంది అనుకుంటున్న సమయంలో ఆ రీమేక్ ను పక్కకు పెట్టేశారు. అరవింద స్వామి పాత్రకు ఎవరిని తీసుకోవాలనే విషయమై తేడాలు రావడం వల్లే ఆ ప్రాజెక్ట్ ను వదిలేసినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నిర్మాత రామ్ తాళ్లూరి మరియు రవితేజలు ఇతర సినిమాలతో బిజీ అయ్యారు. ఆ రీమేక్ ను ఆ తర్వాత ఎవరు కూడా చేసేందుకు ముందుకు రాలేదు.
మూడు సంవత్సరాలుగా రామ్ వద్దే ఆ సినిమా రైట్స్ ఉన్నాయి. డబ్బులు ఎందుకు వృదా చేయడం అనుకున్న నిర్మాత రామ్ తాళ్లూరి ఇప్పుడు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. బోగన్ సినిమాను అదే టైటిల్ తో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించాడు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. థియేటర్లు లేని ఈ సమయంలో సినిమాను డబ్బింగ్ చేస్తున్నట్లుగా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా థియేటర్లు ఓపెన్ వరకు ఉండకుండా ఓటీటీ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఆ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగులో హిట్ అయితే రవితేజ మరియు నిర్మాత కూడా అయ్యో రీమేక్ చేస్తే బాగుండేదేమో అనుకుంటారు కావచ్చు.