మెగా హీరోకు నిర్మాత అండ!

Update: 2018-07-18 08:30 GMT
ఓ మాదిరిగా అయినా ఆడుతుందన్న అంచనాలకు భిన్నంగా ఆరో డిజాస్టర్ ని చేతికిచ్చిన తేజ్ ఐ లవ్ యు షాక్ కి సాయి ధరమ్ తేజ్ డిఫెన్స్ లో పడిపోయాడు. ఎంత ప్లాప్ అయినా మీడియాకైనా అందుబాటులో ఉండే తేజు రిజల్ట్ తెలియడం ఆలస్యం వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు. కారణాలు బయటికి చెప్పుకోరు కాబట్టి దానికి వెకేషన్ అని పేరు పెట్టారు. నిజానికి ఫిజిక్ పరంగా తనను ఇబ్బంది పెడుతున్న బరువును తగ్గించుకోవడం కోసమే వెళ్లాడని  ఇప్పటికే ఫిలిం నగర్ లో టాక్ ఉంది. దానికి తగట్టు మంచి ఈజ్ తో డాన్స్ చేసే సాయి ధరమ్  తేజ్ మొన్న వచ్చిన తేజ్ ఐ లవ్ యులో మాత్రం ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపించింది. అందుకే స్పెషల్ గా ట్రైనర్ ఆధ్వర్యంలో కొత్త మేకోవర్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. తనకు తోడుగా నేల టికెట్టు నిర్మాత తాళ్ళూరి రామ్ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. తేజ్ తో పాటు కలిసి వెళ్లాడా లేక స్వతహాగా ఆయన ఉండేది అమెరికాలో  కాబట్టి కలిసారా అనే క్లారిటీ లేదు.

సాయి ధరమ్ తేజ్ కు రామ్ తాళ్ళూరి అండగా ఉండడానికి మరో బలమైన కారణం లేకపోలేదు. తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ లాంచింగ్ మూవీకి  నిర్మాత రామ్ తాళ్ళూరినే అని టాలీవుడ్ టాక్. సో తన సినిమా హీరోకు స్వయానా అన్నయ్య కాబట్టి ఆ మాత్రం సహాయం చేయటం సహజం. అలా కాకుండా సాయి ధరమ్ తేజ్ తోనే ఆయనేమైనా సినిమా ప్లాన్ చేశాడా అనేది  ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ ఛాన్స్ మాత్రం లేదు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాతో పాటు గోపిచంద్ మలినేనితో కమిట్మెంట్ ఉన్న తేజు ఇప్పట్లో ఇంకో సినిమా గురించి ఆలోచన చేసే పరిస్థితిలో లేడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం కోరుకున్న మేకోవర్ ని సాధించుకోవడం మీదే ఉంది. అది వచ్చాకే కొత్త సినిమా షూటింగ్ ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేస్తాడట. సో ఈ ఏడాది తేజు మరో సినిమా లేనట్టే.
Tags:    

Similar News