ట్విట్టర్ సాక్షిగా 'శాస్త్రి అనే నేను'

Update: 2018-03-19 07:00 GMT
మహేష్ బాబు 'భరత్ అనే నేను' కోసం ఫాన్స్ ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో అంత కన్నా రెట్టింపు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఉత్సాహం చూపిస్తున్నారు. నేరుగా అవకాశం లేదు కాబట్టి ట్విట్టర్ ను వేదికగా మార్చుకున్నారు. నిన్న ఉగాది పండగ సందర్భంగా అచ్చమైన తెలుగు పంచె కట్టులో మహేష్ కొత్త పోస్టర్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామ జోగయ్య శాస్త్రి అభిమానులకు కిక్ ఇవ్వడం కోసం అన్నట్టుగా పలు ఆసక్తికరమైన ట్వీట్లు పెడుతున్నారు. శ్రీరామనవమి కంటే ముందు ఒక మనకో పండగ వచ్చే సూచనలున్నాయన్న శాస్త్రి అది ఫస్ట్ ఆడియో సింగల్ రిలీజ్ గురించే అనే టాక్ అప్పుడే ఫాన్స్ మధ్య మొదలైంది. విడుదలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ వేగాన్ని ఇంకా పెంచాల్సిన టైం ఎలాగూ వచ్చేసింది.

సినిమా యూనిట్ కంటే ముందు ఆ బాధ్యతను శాస్త్రి తీసేసుకున్నారు. అది ఆడియో సింగల్ అని ఆయన పేర్కొనకపోయినా టీజర్ విడుదలైంది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్నది వీటికి మాత్రమే. పైగా రామజోగయ్య శాస్త్రి గారి కనెక్షన్ ఏ సినిమాకైనా పాటల వరకే ఉంటుంది కనక అదే నిజం కావొచ్చు. ఆ వెంటనే కొరటాల శివకు ట్యాగ్ చేస్తూ ఈ సారి నేను అభిమానుల పక్షం ఉంటాను అని చెప్పిన శాస్త్రి గారు లీక్ చేసినందుకు ముందస్తు సారీ చెప్పినట్టుగా సరదాగా అనిపించింది. అక్కడితో ఇది అయిపోలేదు. ఏప్రిల్ మూడో వారంలో ఒక ఎపిక్ ని చూడబోతున్నారు అని హామీ ఇచ్చేసారు శాస్త్రి గారు. టీం మొత్తం ప్యాషన్ తో ఉందని చాలా అద్భుతంగా సినిమా వస్తోందని ఊరించేసారు.

అంతా బాగానే ఉంది కాని తాను వర్క్ చేసిన సినిమాల గురించి రామజోగయ్య శాస్త్రి  ఇలా ట్వీట్లు పెట్టడం కొత్తేమి కాదు. గతంలో డిజాస్టర్స్ కు, బ్లాక్ బస్టర్ హిట్స్ కు విడుదలకు ముందు ఇలాగే ఆయన ట్వీట్లతో ఫాన్స్ కి హుషారు కలిగించే వారు.ఏదేమైనా ఎవరో ఒకరు అభిమానులకు ఇలా బూస్ట్ అందిస్తూ ఉంటే అదో ఆనందం. ఏప్రిల్ 20 రిలీజ్ డేట్ సెట్ చేసుకున్న భరత్ అనే నేను టీం కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ పనులు పూర్తి చేయటంలో బిజీగా ఉన్నారు .

Tags:    

Similar News