'అంత‌రిక్షం' లో షాకింగ్ నిజం

Update: 2018-12-12 10:43 GMT
మ‌న ఇస్రో భోగోతాన్ని అంత‌రిక్షం సినిమాలో లీక్ చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న `అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్` ఈనెల 21న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకి సెట్స్ డిజైన్ చేసిన క‌ళాద‌ర్శ‌కులు రామ‌కృష్ణ- మౌనిక జోడీ ఈ సినిమాకి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు.

అంత‌రిక్షం నేప‌థ్యం.. స్పేస్ షిప్ నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాం కాబ‌ట్టి దీనికోసం బోలెడంత రీసెర్చ్ చేయాల్సి వ‌చ్చింద‌ని, ఆ క్ర‌మంలోనే బోలెడ‌న్ని విష‌యాలు తెలిశాయ‌ని ఆ ఇద్ద‌రూ వెల్ల‌డించారు. స్పేస్ సెంట‌ర్‌పై రీసెర్చ్ అంటే ఇస్రో అనుమ‌తించిందా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తే అస‌లు ఆ ఛాన్సే లేద‌ని అన్నారు. ఇస్రోలో, స్పేస్ సెంట‌ర్ల‌లో ప‌ని చేస్తున్న స్నేహితులు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం సెట్లు డిజైన్ చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఇలాంటి క్లిష్ట‌మైన వ‌ర్క్ ఇదివ‌ర‌కూ చేయ‌లేద‌ని .. నేరుగా త‌మ‌కు స్పేస్ సెంట‌ర్ చూసేందుకు అనుమ‌తి ల‌భించ‌లేద‌ని, అయితే ఇస్రోకి అప్ల‌య్ చేశామ‌ని వెల్ల‌డించారు. ఉన్న త‌క్కువ స‌మ‌యంలో, ప‌రిమిత బ‌డ్జెట్‌లో ది బెస్ట్ సెట్స్‌ని అంత‌రిక్షం కోసం వేశామ‌ని తెలిపారు.

సంద‌ట్లో స‌డేమియాగా వీళ్లు దేశానికి సంబంధించిన‌ ఓ పెద్ద ర‌హ‌స్యాన్ని లీక్ చేశారు. వాస్త‌వానికి అంత‌రిక్షం కోసం ప‌రిశోధించే స్పేస్ షిప్ టెక్నాల‌జీలో మ‌న భార‌త‌దేశం చాలా వెన‌క‌బ‌డి ఉంది. గొప్ప సైంటిస్టులు ఉన్నా కానీ, అమెరికా నాసా అంత‌రిక్ష కేంద్రంతో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌వి దిగ‌దుడుపేన‌ని వెల్ల‌డించ‌డం షాకిచ్చింది. స్పేస్ సెంట‌ర్ నిర్మాణం కోసం చేసిన ప‌రిశోధ‌న‌లో తాము గూగుల్‌ తో పాటు - బోలెడ‌న్ని పుస్త‌కాల్ని చ‌దివామ‌ని అన్నారు. చాలా చోట్ల‌కు తిరిగి స‌మాచారం సేక‌రించాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. స్పేస్ సెంట‌ర్‌లో బోలెడ‌న్ని విభాగాలుంటాయి. ప్ర‌తిదానిని ప‌క్కాగా డీటెయిల్డ్ గా డిజైన్ చేయాలి. అది కూడా కేవ‌లం నెల 15 రోజుల గ్యాప్‌ లోనే ఈ సెట్స్‌ ని వేయాల్సి వ‌చ్చిందని తెలిపారు. ఈ త‌ర‌హా అత్యంత వేగంగా పూర్త‌యిన ఏకైక సినిమా కూడా ఇదే. కేవ‌లం 70రోజుల్లో అంత‌రిక్షం సినిమా తీశార‌ని వెల్ల‌డించారు. ఒకేసారి రెండు సినిమాలు మించి చేసే అల‌వాటు లేదు. స‌మ‌యం తీసుకునే ప‌ని చేస్తామ‌ని ఈ క‌ళాద‌ర్శ‌కుల జంట రివీల్ చేశారు. ఈనెల 21న అంత‌రిక్షం రిలీజ‌వుతోంది. ఇందులో ఎన్నో వింత‌లు విశేషాలు ఆక‌ట్టుకుంటాయ‌ని వెల్ల‌డించారు.


Tags:    

Similar News