సినిమాల్లో స్మోకింగ్.. డ్రింకింగ్ సీన్స్ పై చాలారోజులనుండి విమర్శలు ఉన్నాయి. ఈ ధూమపానం.. మద్యపానం అలవాట్లను ఏదో ఘనకార్యం అన్నట్టుగా చూపించే సీన్లు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయనే ఒక వాదన ఉంది. మరో వైపు ఫిలిం మేకర్స్ మాత్రం ఇవి కొత్తగా జనాలకు చూపించే విషయాలు కాదని.. సమాజంలో ఉన్నవాటినే మేం చూపిస్తున్నామని అంటారు. తాజాగా రిలీజ్ అయిన విశాల్ తమిళ సినిమా 'అయోగ్య' పోస్టర్ ఇప్పుడు అలాంటి వివాదం లో చిక్కుకుంది.
ఈ సినిమా పోస్టర్ లో విశాల్ ఒక బీరు బాటిల్ తో ఒక జీపుపై కూర్చుని కనిపించాడు. ఇది పలు విమర్శలకు దారి తీసింది. తమిళ నాడులోని పీఎంకె పార్టీ నాయకుడు డా. ఎస్. రామదాస్ విశాల్ పోస్టర్ ను విమర్శిస్తూ అయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా రాశారు.. "విశాల్ నటించిన అయోగ్య సినిమా నుంది బీర్ బాటిల్ పట్టుకుని ఉన్న పోస్టర్ ను వెంటనే తొలగించాలి. విశాల్ ఈ పోస్టర్ ద్వారా ఏం సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారు? నడిగర్ సంగం సెక్రటరీగా ఆయన మరింత సామాజిక భాద్యతతో ఉండాలని నేను ఆశిస్తున్నాను".. "అయన నడిగర్ సంగం అధ్యక్షుడు కాబట్టి నేను గతంలో ఆయనకు సినిమాల్లో స్మోకింగ్ సీన్లు నిషేధించాలా చర్యలు తీసుకోవాలని ఒక లెటర్ కూడా రాశాను. ఇప్పుడు ఆయనేమో మరో అడుగు ముందుకేసి చేతిలో బీరు బాటిల్ తో వచ్చాడు. ఇదా అయన సామాజిక బాధ్యతను చూపించే విధానం!!!"
గతంలో ఈ ఎస్. రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ విజయ్ సినిమాల్లో స్మోకింగ్ సీన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. రజనీకాంత్ సినిమాలలో స్మోకింగ్ ను గ్లోరిఫై చెయ్యడం పై కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. సహజంగా హీరోలు ఇలాంటి విషయాలపై స్పందించరు. మరి తాజా విమర్శల నేపథ్యంలో విశాల్ ఏమంటాడో వేచి చూడాలి.