రామజోగయ్య శాస్త్రి జాగో జాగో

Update: 2015-07-31 05:13 GMT

శ్రీమంతుడు చిత్రంలో పాటలన్నీ సూపర్‌ హిట్‌ అన్న టాక్‌ వచ్చింది. అందులో జాగో జాగో పాట ఇప్పుడు ఎఫ్‌ ఎం, టీవీ చానెళ్లలో మోగిపోతోంది. అయితే ఈ పాట ఎలా పుట్టింది, దేవీ శ్రీ ట్యూన్‌ లో మహత్యం ఎంత? అనేది లిరిసిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి స్వయంగా వివరించారు.

దేవీశ్రీ ప్రసాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కొత్త బాణీ క్రియేట్‌ చేయడానికి పడే తపన అద్భుతం. పైగా సాహిత్యం కొత్తగా, పాట పాడే గొంతు కొత్తగా ఉండాలని తపన పడతారు. ఈ పాటని నాకెంతో ఇష్టమైన రఘు ధీక్షిత్‌ గారిచేత పాడించారు. సన్నాఫ్‌ సత్యమూర్తి లోని చల్‌ చల్‌ చలో సాంగ్‌ ఆయనే పాడారు. ఇప్పుడీ పాట ఆయన గొంతు నుంచే వెలువడింది. ట్యూన్‌ ఓ ఎత్తు అయితే వైవిధ్యమైన వాయిస్‌ తో పాడించడం ఇంకో ఎత్తు. అక్కడే ఈ పాట ఇంత పెద్ద సక్సెసైంది.

మిర్చి సినిమాకి సింగిల్‌ కార్డ్‌ రాసే అవకాశం ఇచ్చారు కొరటాల. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. మిర్చిలో పండగలా దిగి వచ్చావు .. పాటకి వచ్చినంత గుర్తింపు 'జాగో జాగో ....' పాటకి వచ్చింది. ఈ పాటలో ప్రతి పదం కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.
Tags:    

Similar News