యంగ్ హీరో సందీప్ కిషన్.. హన్సిక జోడీగా తెరకెక్కిన 'తెనాలి రామకృష్ణ' చిత్రంను వచ్చే నెలలో ప్రేక్షకు ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెడుతున్నారు. ఈనెల 20వ తారీకున సినిమాకు సంబంధించిన కర్నూలు కత్తివా.. అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ పాట పోస్టర్ లో సందీప్ కిషన్ మెడపై హన్సిక కత్తి పెట్టి ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈమద్య కాలంలో సందీప్ కిషన్ కు మంచి కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. దాంతో ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న జి నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరోయిన్ వరలక్ష్మి కీలక పాత్రలో నటించడంతో అంచనాలు పెరిగాయి.
ఇప్పటి వరకు తెలుగులో వరలక్ష్మి నేరుగా ఒక్క సినిమా కూడా నటించలేదు. కాని పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆమె బాగా ఎంటర్ టైన్ చేసింది. అందుకే ఈ చిత్రంతో ఆమె మరింతగా తెలుగు ప్రేక్షకులకు రీచ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. తెనాలి రామకృష్ణ సినిమా కర్నూలు నేపథ్యంలో తెరకెక్కింది కనుక అక్కడే ప్రీ రిలీజ్ వేడుక జరపబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.