అసలు పేరు విజయలక్ష్మి అయినా.. దేశం మొత్తానికి రంభ అనే పేరుతోనే ఈమెతో పరిచయం ఉంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేసులోకి చేరగానే.. ఈమెకు బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో.. సడెన్ గా జంప్ అయిపోయిన ఈ బ్యూటీ.. అక్కడ బాగానే ఛాన్సులు దక్కించుకోగలిగింది. కెరీర్ చివరకు చేరుకుంటున్న తరుణంలో కెనడావాసిని చేసుకున్న రంభ.. విడాకుల కోసం కొంతకాలం ముందే ఫైల్ చేయగా.. ఇప్పుడు పిల్లల పెంపంకం కూడా తననే ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.
కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాభన్ ను 2010లో రంభ వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు సంతానం కూడా. అయితే.. దుష్యంతి సెల్వ వినాయకం అనే మహిళతో అతనికి ముందే వివాహం అయిన విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నాడనేది రంభ వాదన. పెళ్లి సమయంలో తెలియకపోయినా.. ఆ తర్వాత విషయం తెలిసి చాలా విచారించిందట రంభ అలియాస్ విజయలక్ష్మి. భర్త ద్వారా చాలా ఇబ్బందులు పడ్డానని కోర్టుకు చెబుతోందీమె.
కెనడాలో రంభ భర్త వేసిన పిటిషన్ కారణంగా పిల్లలకు దూరం కావాల్సి వచ్చినా.. ఆ తర్వాత పై కోర్టులో కేసు వేసి మరీ పిల్లలకు దగ్గర కాగలిగింది రంభ. ఆఖరికి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసినా కూడా.. కెనడా కోర్టు తిరస్కరించింది. తన పిల్లలు చట్టబద్ధంగా తనకే చెందాలంటూ రంభ వేసిన పిటిషన్ పై జనవరి 21.. 2017న కోర్టు విచారణ జరపనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/