#RRR లీకివ్వ‌మంటే సీతారామ‌రాజే వ‌ల్ల‌కాద‌న్నాడు!

Update: 2021-09-21 03:30 GMT
#RRR చిత్రాన్ని ఎస్.ఎస్.రాజ‌మౌళి ఎంత ప‌క‌డ్భందీగా తెర‌కెక్కిస్తున్నారో తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి లీకులు ఇప్ప‌టివ‌ర‌కూ లేవు. ఒక‌టీ అరా ఫోటోలు అప్ప‌ట్లో ఆన్ లొకేష‌న్ నుంచి వచ్చిన‌వి మిన‌హా కీల‌క‌మైన లీకులేవీ లేవు. అయితే ఇంత జాగ్ర‌త్త ఎలా సాధ్యమో సీతా రామ‌రాజు పాత్ర‌ధారి రామ్ చరణ్ చెప్పిన దానిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. బిగ్ బాస్ షోలో అతిథిగా చ‌రణ్ సైతం షాక్ ల మీద షాకులిచ్చారు. త‌న‌కి కూడా సినిమాలో చిన్న బిట్ కూడా చూపించ‌డం లేద‌ని జ‌క్క‌న్న పైకి నెపం వేశారు చ‌ర‌ణ్‌.

``నేను ల్యాబ్ లో డబ్బింగ్ చెబుతున్నాను. షూట్ చేసిన సాంగ్స్ కు సంబంధించిన షాట్స్ ఎలా వస్తున్నాయో అని రాజమౌళి వార‌సుడు కార్తికేయ ను .. కీరవాణి సతీమణి వల్లి గారిని ప్రతిరోజు అడుగుతున్నాను. ఇప్పటి వరకు కనీసం ఆ పాటలకు సంబంధించిన షార్ట్ ను కూడా మాకు చూపించలేదు`` అని చ‌ర‌ణ్ నాగ్ తో అన్నారు. ఇదెక్క‌డి అన్యాయం అండీ అంటూ నాగ్ దానికి స‌ర‌దాగా న‌వ్వేశారు.

అయితే ఏదైనా ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాకి సంబంధించిన లీకులు బ‌య‌ట‌కు వ‌స్తే క్యూరియాసిటీ పోతుంది. అందుక‌నే రాజ‌మౌళి - వ‌ల్లి- కీర‌వాణి- కార్తికేయ టోట‌ల్ ఫ్యామిలీ ప‌క‌డ్భందీగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. మ‌ర‌క‌త మ‌ని కీర‌వాణి సంగీతం అందించే చోటి నుంచి లీకులు రానివ్వ‌రు. లైన్ ప్రొడ్యూస‌ర్ గా వ‌ల్లి ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఇక‌పోతే డ‌బ్బింగ్ ఎడిటింగ్ రూముల‌కు ఆధిప‌త్యం వ‌హించే కార్తికేయ నుంచి ఎలాంటి లీక్ సాధ్యం కాదు. ఇంత గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంటారు కాబ‌ట్టే రాజ‌మౌలి సేఫ్ గేమ్ ఆడుతున్నార‌న్న‌మాట‌. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదేపై టీమ్ ఎప్ప‌టికి క్లారిటీనిస్తుందో చూడాలి.
Tags:    

Similar News